📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest Telugu News : Poverty: జీవిత పాఠాలను నేర్పుతున్న పేదరికం

Author Icon By Sudha
Updated: November 7, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పేదరికం అనేది మనుష్య జీవితంలోని కఠినమైనసత్యం. అది ఒకరికి బాధగా, మరొకరికి బోధగా మారుతుంది. కానీ నిజంగా పేదరికం వెనుక దాగి ఉన్న గౌరవాన్ని గమ నించగలిగితే, మనం జీవన విలువను మరో కోణంలో చూడ గలుగుతాము. పేదరికం అనేది కేవలం ఆర్థిక లోపం కాదు, అది మనిషి మనసు ఏ స్థాయిలో సహనం, కృషి, నిబద్ధత చూపుతుందో పరీక్షించే దశ. ఆ పరీక్షను గెలిచినవాడు సంపద లేకపోయినా గొప్పవాడే. పేదరికం (Poverty) మనిషి జీవితంలో కొన్నిసార్లు గురువులా మారుతుంది. అది కష్టాన్ని నేర్పు తుంది, విలువను తెలియజేస్తుంది. ఆకలిని తట్టుకోవడం ద్వారా తృప్తి విలువ తెలుస్తుంది. అవసరాన్ని అర్థం చేసు కోవడం ద్వారా ఇతరుల బాధ కూడా మనసుకు తాకుతుంది. పేదరికం మనిషి మనసులో దయ అనే విత్తనాన్ని నాటు తుంది. ధనం లేకున్నా హృదయం ధనవంతమైపోయే అద్భుత శక్తిఅదే. మన గ్రామీణ జీవితంలో ఇలాంటి పేదరికపు గౌరవం తరచూ కనిపిస్తుంది. రోజంతా పొలంలో పని చేసి రాత్రి ఒక తృప్తి భోజనం చేసిన రైతు, కష్టంతో చదివి కుటుంబాన్ని నిలబెట్టిన విద్యార్థి, దుస్తులు చిరిగినా మనసు సజ్జనతతో నిండిన అమ్మాయి వీరంతా పేదరికంలో జీవిస్తూ గౌరవాన్ని కాపాడిన మనుషులు. వాళ్ల వద్ద విలా సం లేదు కానీ విలువ ఉంది. వాళ్లు ఎవరికి హాని చేయ కుండా, ఎవరి హక్కు దోచుకోకుండా జీవిస్తారు. అది నిజ మైన గౌరవం. ధనం ఉన్నవాడి దగ్గర గర్వం ఉంటే, పేద రికంలో ఉన్నవాడి దగ్గర గౌరవం ఉంటుంది. పేద మనిషి తల వంచకపోవడం అంటే అతనిలో ఉన్న ఆత్మగౌరవం. ఆకలిని తట్టుకుంటాడు కానీ అబద్ధం చెప్పడాన్ని తట్టుకోడు. కష్టంతో సంపాదించిన రొట్టె అతనికి మధురమైనది, ఎందు కంటే దానిలో అతని గౌరవం దాగి ఉంటుంది. దానం కోర డం కంటే శ్రమతో సంపాదించడం అతనికి ఆనందం. పేదరికం (Poverty)మనిషి మనసుని బలంగా చేస్తుంది. అది జీవితాన్ని అర్థం చేసుకునే పాఠం.

Read Also : SBI: 100 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎస్ బిఐ

Poverty

మానసిక సంపదను పెంచే శక్తి

ద్రవ్య సంపద లేకున్నా పేదమనిషి హృదయంలో మానవత్వం, నిబద్ధత, సహనం వంటి విలు వలు మెదులుతాయి. అవే అతని అసలైన సంపద. ఈ ప్రపంచంలో పేదరికం తొలగిపోవాలని మనం కోరుకుంటాం, కానీ దాని ద్వారా పుట్టిన ఆత్మగౌరవం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉండాలి. పేదరికం మనిషిని విలువైన అనుభవాలతో నింపుతుంది. ఎవరిపై ఆధారపడకుండా నిలబడటం, ప్రతి కూలతలోనూ మనసును నిలబెట్టుకోవడం, తక్కువలో సం తోషం కనుగొనడం ఇవి పేదరికం నేర్పిన పాఠాలు. దానికి గురైనవారే ఇతరుల కష్టాన్ని సులభంగా అర్థం చేసుకుంటా రు. ధనవంతుడికి కావాల్సినది విలాసం అయితే, పేదవాడికి కావాల్సినది గౌరవం. ఆ గౌరవం అతనికి జీవితాను భవం ఇచ్చిన బ
హుమతి. ఒక తల్లి తన పిల్లలకు అరిటాకులో భోజనం పెట్టినప్పుడు, అది ప్రేమతో కలిసిన పేదరికపు సౌందర్యం. ఒక తండ్రి పగలంతా కష్టపడి ఇంటి ముందర చిరునవ్వుతో నిలబడినప్పుడు, అది గౌరవం. పేదరికం ఇలాం టి ప్రశాంతమైన గౌరవాన్ని కలిగిస్తుంది. ఈ గౌరవం నోట చెప్పలేనిది, అది కేవలం మనసులో అనుభూతి చెంద వలసినది. పేదరికం అంటే కొంతమంది దురదృష్టంగా భావి స్తారు. కానీ నిజానికి అది మనిషి మానసిక సంపదను పెంచే శక్తి. అది మనసును చైతన్యపరుస్తుంది. మనం కలలకోసం పోరాడటానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుడు సుఖంతో ఉండవచ్చు కానీ పేదవాడు ఆశతో జీవిస్తాడు. ఆ ఆశేఅతని జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మన సంస్కృతిలో పేద రికం ఎప్పుడూ అవమానంగా చూడబడలేదు. పేదవాడికీ గౌరవం ఉండాలి అనే భావన మన పూర్వీకుల తాత్వికతలో ఉంది. పేదరికం అనేది మనిషిని మట్టిలో కలిపే కాదు, నేల వాసన నేర్పే అనుభవం. ఒక పేదవాడు కూడా సత్యంకోసం
నిలబడి, తన కృషితో గెలవగలడని మన సాహిత్యం ఎన్నో సార్లు చూపింది. సంపద ఉన్నవాడి చేతిలో అధికారం ఉండొ చ్చు కానీ పేదవాడి చేతిలో జీవన బలమే ఉంటుంది. ఆ బలం అతనికి అంతరాత్మ ఇచ్చిన శక్తి. రోజూ పోరాటం చేసే జీవితం అతనికి ధైర్యం నేర్పుతుంది.

పేదరికం తాత్కాలికం

పేదరికం కారణంగా వచ్చే కన్నీటి చుక్కలు కూడా గౌరవంతో తడుస్తాయి. ఆ కన్నీరు అవమానానికి కాదు, ఆత్మగౌరవానికి సూచన. పేదరికంలో పుట్టినవారు పెద్దవారై ధనవంతులైనా, వారి మనసులో ఆ గౌరవపు విత్తనం నాటుకుపోయి ఉంటుంది. వాళ్లు చిన్నపుడు కష్టాన్ని చూసినందునే, తర్వాత ఇతరుల కష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. పేదరికం ఇస్తే తాత్కాలిక బాధ కానీ జీవితాంతం నిలిచే విలువ. ఒక పేద విద్యార్థి రాత్రంతా దీపం వెలిగించి చదివి విజయాన్ని అందుకుంటా డు. ఒక కూలి కాళ్ల మీద నిలబడి పిల్లల భవిష్యత్తు తీర్చు తాడు. ఒక పేద కవి తన ఆకలి బాధల్లో కూడా మానవ త్వం గురించి రాస్తాడు. వీళ్లందరిలో పేదరికం ఉంది, కానీ దాని వెనుక గౌరవం మరింత వెలుగుతుంది. ఆ గౌరవమే మన సమాజానికి స్పూర్తి. సంపదను కొలవడానికి మనం గణాంకాలు వాడతాం, కానీ గౌరవాన్ని కొలవడానికి గుండె కావాలి. పేదరికం వెనుక ఉన్న గౌరవం అటువంటి హృద యాలతోనే కనిపిస్తుంది. అది కష్టాన్ని గౌరవంగా మార్చే మానసిక శక్తి. దానిని పొందినవాడు ఎప్పటికీ దాన్ని కోల్పో డు. ప్రపంచం మొత్తం పేదరికం తొలగించాలని కోరుకుం టున్నా, మనం దాని వెనుక ఉన్నమానవత్వాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దయ, సహనం, శ్రమ ఈ మూడు పేదరికం నేర్పిన వరాలు. ఈ విలువలు ఉన్నచోటే సమాజం స్థిరంగా ఉంటుంది. చివరికి పేదరికం మనిషిని నేర్పిన ముఖ్యమైన పాఠం ఇదే. గౌరవం అనేది డబ్బుతో కొనలేనిది. అది మన కర్మలో, మన ఆలోచనలో, మన మనసులో ఉంటుంది. మనం పేదవారైనా, మన గౌరవాన్ని కాపాడు కుంటే మనం జీవితంలో ఓడిపోలేదు. పేదరికం తాత్కాలికం, కానీ గౌరవం శాశ్వతం. అదే మనిషి సొంత వెలుగు.

Poverty

ఎదగాలనే తపన

పేదరికం మనిషి జీవితంలో ఒక అద్దం లాంటిది. అందులో మనిషి తన అసలు రూపాన్ని చూసుకుంటాడు. ఆ అద్దం ముందు అహంకారం నిలవదు. స్వార్థం నిలవదు. పేదరికం మనసును మలుస్తుంది. హృదయాన్ని వినమ్రతతో నింపు తుంది. కానీ ఆ వినమ్రత వెనుక దాగి ఉన్నది అసలైన గౌరవమే. ఆ గౌరవం మాటల్లో కాకుండా జీవన విధా నంలో ప్రతిబింబిస్తుంది. మన సమాజంలో చాలామంది పేదవారే కానీ వారి మనసులు సంపన్నంగా ఉంటాయి. తాము తిన్నా తినకపోయినా ఇతరులకు పంచే స్వభావం వారిలో సహజం. ఆ దానం ధనంతో కాకుండా హృదయంతో జరుగుతుంది. ఒక పేద తల్లి పొలంలో కష్టపడి సంపా దించిన కొద్దిపాటి అన్నం పక్కింటి ఆకలిగొన్న పిల్లకు ఇస్తే అది గౌరవానికి నిదర్శనం. ఆమె ఇవ్వగలిగింది తక్కువైనా, ఆమె మనసు ఇచ్చింది ఎక్కువ. ఆ తేడానే పేదరికంలోనూ సౌందర్యం. పేదరికం అనేది మనిషి మనసును వాస్తవానికి దగ్గర చేస్తుంది. ధనం ఉన్నవారు ప్రపంచాన్ని చూడగలరే మో కానీ పేదవాడు జీవితం లోతును అనుభవిస్తాడు. ఒక కూలి చెమటతో కూడిన ప్రతి చుక్కలో గౌరవం ఉంటుంది. ఆ చెమటనే అతని పతకం. ఆ చెమట వాసనే అతని విజ యగాధ. పేదరికం మనిషిని కష్టపడే శీలంతో నింపుతుంది. పేదవాడు ఎప్పుడూ ఎదగాలనే తపనలో ఉంటాడు. కానీ ఆ తపనలో అతను ఎవరిహక్కును లాక్కోవాలనుకోడు. మన కవులు, కళాకారులు, రైతులు, కార్మికులు వీళ్లంతా జీవితంలో పేదరికాన్నిచూసినవారే. కానీ ఆ పేదరికమే వారి సృజనాత్మకతకు ప్రేరణ అయింది. ఆకలి తెలుసుకున్నవాడే పరమా నందాన్ని అర్థం చేసుకుంటాడు. కన్నీరుతుడిచినవాడే చిరు నవ్వు విలువ తెలుసుకుంటాడు. పేదరికం ఇచ్చిన ఈ అను భవమే మానవత్వాన్ని గొప్పదనం వైపు నడిపిస్తుంది.
డా. చిటికెన కిరణ్ కుమార్

పేదరికం అని ఎవరిని అంటారు?

పేదరికం, సాధారణ లేదా సామాజికంగా ఆమోదయోగ్యమైన మొత్తంలో డబ్బు లేదా భౌతిక ఆస్తులు లేని వ్యక్తి స్థితి . ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకునే మార్గాలు లేనప్పుడు పేదరికం ఉందని అంటారు. ఈ సందర్భంలో, పేద ప్రజలను గుర్తించడానికి ముందుగా ప్రాథమిక అవసరాలు ఏమిటో నిర్ణయించడం అవసరం.

పేదరికంపై పోరాటం ఎలా చేయాలి?

పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడే వివిధ మార్గాలు ఉన్నాయి, వీటిలో వేతనాలను పెంచే మరియు పేదలకు ఉద్యోగ అవకాశాలను విస్తృతం చేసే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం , విద్యను మెరుగుపరచడం, మైక్రోఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడం మరియు అనేక ఇతర సంఘర్షణలను అంతం చేయడం వంటివి ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Economy human-struggle latest news life-lessons Poverty social-issues Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.