📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Poverty : పేదరికం తగ్గుముఖం!

Author Icon By Sudha
Updated: October 23, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో పేదరికం తగ్గిందని ఎంతోకాలంగా విడుదలవుతున్న సర్వే సంస్థల నివేదికలు, నీతి ఆయోగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సంస్థ కూడాఅదే చెబుతోంది. ఈ సంస్థ ఏటా తన సర్వే నివేదికలు అందిస్తూనే ఉంది. కేవలం 15 సంవత్స రాల వ్యవధిలోనే ప్రపంచ విలువను తగ్గించుకున్న 25 దేశాలలో భారత దేశం కూడా ఒకటి. మనదేశంలో 2021 నుంచి 2025 మధ్య 415 మిలియన్ల మంది ప్రజలు పేదరికం (Poverty) నుంచి గట్టెక్కిన వైనాన్ని యునైటెడ్ నేషన్స్ నివేదిక గతంలోనే వెల్లడించింది. ఇది నిజంగా అద్భుతమైన విజయం గానే భావించాలి. 2023 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2016-2021 మధ్య దేశ జనాభాలో 10శాతం మంది పేదరికం నుంచి తప్పించుకో గలిగారని వివరించిం ది. ఇలాంటి సానుకూల మార్పులకు దోహదపడే జీవన ప్రమాణాల సూచికలలో గణనీయ ప్రగతి కనపడింది. 2005-2006లో సుమారు 645 మిలియన్ల మంది పేదరికం (Poverty)లో మగ్గుతుండగా, ఆ సంఖ్య 2015-2016 నాటికి 370మిలియన్లకు తగ్గింది. 2019-2021 లో దాదాపు 230 మిలి యన్లకు తగ్గింది. అంటే దేశంలో ప్రగతిశీల ఆలోచనలు, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి ఆర్థిక స్థితిగతులను పెంచేలా అమలు చేస్తున్నవివిధ పథకాల ఫలితంగానే పరిగణనలోకి తీసుకోవాల్సిందే! ఏటా అంతర్జాతీయ పేదరిక నిర్మూ లన దినంగా అక్టోబరు 17న జరుపుకుంటాము. అను కున్న లక్ష్యాలు సాధించగలి గామో లేదో తెలుసుకునే ప్రక్రియలో ద గ్లోబల్ ఇండెక్స్ సంస్థఈ ఏడాది అక్టోబరు 18నాటికి పేదరిక స్థాయిని అంచనా వేసి, ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న వారి స్థితిగతులపై ప్రత్యేక నివేదికను విడుదలచేసింది. పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి సంకల్పిస్తే భారత్ పేదరిక నిర్మూలన నినాదాన్ని అందిపుచ్చుకుంది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధిలక్ష్యాలలో 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలి. ఆనాటికి ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువనే ఉంటారని 2019 జూలైలో ఆ సంస్థ నివేదిక చెబుతోంది. 101 దేశాల్లో 23.1 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగం 18 ఏళ్ల లోపు వారే. అధ్యయనం జరిపిన దేశాల్లో 17.5 శాతం వయోజనులు పేదరికంలో మగ్గుతుండగా, 33.8 శాతం చిన్నారులు ఆదురవస్థలో కూరుకుపోయి ఉన్నారు. పేద రికాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించిన దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. అదే బాటలో భారత్ కూడా నడుస్తోంది. ఇది ఈ నాటి సమస్య కాదు. ఐతే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి ప్రభుత్వాలు సమాజంలో వెనుకబాటు తనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని బీదల పాట్లు ఎలా ఉంటాయో అధ్యయనం చేసి మరీ పథకాలను అందుబాటులోకి తెచ్చారు. కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని పేదరికంగా పేర్కొంటాము. ఎన్ని ఆటంకాలు ఎదురైనా శాస్త్రీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్నాయని చెప్పాలి. ఇప్పుడొస్తున్న ఫలితాలనుబట్టి పేదరిక నిర్మూలన, సామా జిక పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలకు, పెరు గుతున్న ఆర్థిక అసమానతలు అతిపెద్ద సవాలుగా మారు తున్నాయి. పేదల అభ్యున్నతికి ఉపాధి కల్పనతొలిమెట్టు. ఆపై ఆర్థిక స్వావలంబన కోసం విద్య, వైద్యం, రుణ సదు పాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఒకప్పుడు సంపన్నులు, పేదలు అనే వర్గాల గురించి విస్తృత చర్చ జరిగింది. కానీ ఎంత చేసినా, ఏమి చేసినా మరో వర్గం దారిద్య్రం అంచున ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్లే నిరుపేదలు. ఇప్పుడా పరిస్థితులు మారాయి. 1990లో మొత్తం జనా భాలో 36 శాతం మంది పేదరికంలో ఉంటే, 2025 నాటికి అది 10శాతానికి తగ్గింది. 2030 నాటికి ప్రపం చంలోని ప్రతి ఒక్కరికీ ఆదాయం కనీస అవస రానికి అనుగుణంగా ఉండాలనేది భావన. ప్రపంచం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టడం సహస్రాబ్ది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకంగా చెప్పుకొన్న నేపథ్యంలో దేశాల మధ్య యుద్ధం కాదు, పేదరికంపై సమరం చేయాలని ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో పాటు పెద్దల అభ్యున్నతికి చేసిన ఆలోచనలకు కూడా సత్ఫలి తాలను ఇచ్చింది. శ్రామికులకు ఉపాధి కల్పించే వ్యవ సాయ స్థితిగతులను మెరుగుపరిస్తే వారికి జీవనోపాధి కలిగి ఆర్థికంగా ఎదుగుతారు. భారతీయ శ్రామికుల్లో తొంభై శాతానికిపైగా అసంఘటిత రంగాల్లోనే పని. ఆయా రంగాల్లో వేతన భత్యాల విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి వాటిని మెరుగుపరచినప్పుడే పేదరికాన్ని పారద్రోలేందుకు ఆస్కారముంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా పేదరికం తగ్గుముఖం పట్టిం దని గ్లోబల్ ఇండెక్స్ సర్వే ఘంటాపథంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో 11.77 శాతం నుంచి 6.06కి తగ్గగా తెలంగాణలో 13.180 శాతం నుంచి 5.85 శాతానికి తగ్గింది. అందరికీ ఉపాధి కల్పించినట్లయితే పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించవచ్చు. ప్రభుత్వం, నీతి ఆయోగ్, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. భారత్లో కొన్నిరాష్ట్రాలు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్లో కూడా గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ సర్వే వివరిస్తోంది. ఐరాస లక్ష్యం నెరవేరాలంటే మరో అయిదేళ్లు చిత్తశుద్ధితో ఆయా రాష్ట్రాలు బడుగుల అభ్యున్నతిలో భాగంగా నిరుపేదల లక్ష్యంగా పనిచేయాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News development Economy India Growth latest news Poverty Poverty Reduction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.