Potti Sriramulu: ఇకపై ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’గా నామకరణం.. సీఎం చంద్రబాబు

Read Time:  1 min
Potti Sriramulu: ఇకపై 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం.. సీఎం చంద్రబాబు
Potti Sriramulu: ఇకపై 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం.. సీఎం చంద్రబాబు
FONT SIZE
GET APP

Potti Sriramulu: ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, ఆయన 58 రోజుల నిరాహారదీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (త్యాగనిరతికి ప్రతీక) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నారాయణ, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

Read Also: Sunitha Reddy: వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

Potti Sriramulu: ఇకపై 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం.. సీఎం చంద్రబాబు
Potti Sriramulu: To be named the ‘Statue of Sacrifice’ henceforth CM Chandrababu

ప్రపంచస్థాయి అమరావతి నిర్మాణమే లక్ష్యం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. స్పూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. “అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి గుర్తుగా ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ ఉంది. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజలందరి వాడు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పోస్టల్ కవర్‌ను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

గత ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతిని విధ్వంసం చేసిన తీరుపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “తెలుగు జాతికి గుర్తింపు లేని రోజుల్లో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి రాష్ట్రాన్ని సాధిస్తే, గత పాలకులు రాజధానితో మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు. 

Potti Sriramulu: ఇకపై 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం.. సీఎం చంద్రబాబు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.