📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: CM Chandrababu: గుంతల్లేని రహదారులే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు

Author Icon By Aanusha
Updated: November 26, 2025 • 11:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలోని రహదారులను పూర్తిగా గుంతలు లేకుండా, పాత్ హోల్ ఫ్రీగా తీర్చిదిద్దడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతాంశమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ-లింక్) ను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Read Also: Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ, “ఏపీ-లింక్ సంస్థ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. దానిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆర్ అండ్ బీ శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని ఏ మేరకు వినియోగించుకోవచ్చో పరిశీలించాలి.

లాజిస్టిక్స్ రంగంలోకి భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తే సంస్థ బలపడుతుంది. తద్వారా రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు” అని దిశానిర్దేశం చేశారు.రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు.

Pothole-free roads are the government’s top priority: CM Chandrababu

ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు

“నాణ్యతలో రాజీపడే కాంట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, పర్యవేక్షణ చేసే ఇంజనీర్లు కూడా పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలి. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే కనిపించాలి” అని ఆయన అన్నారు. ఈ ఏడాది మార్చిలో ఆమోదించిన పనులు కేవలం 10-15 శాతం మాత్రమే పూర్తి కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం,

ఇటీవల ఆమోదం పొందిన పనులను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని, పెండింగ్‌లోని పనులన్నీ వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.రహదారుల పరిస్థితిని, నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. “అవసరమైతే డ్రోన్లు, లైడార్ సర్వే, శాటిలైట్ సర్వేల ద్వారా రోడ్ల పరిస్థితిని, పనుల నాణ్యతను పరిశీలించాలి” అని తెలిపారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP LINK Corporation AP Roads Review Chandrababu Meeting latest news Pothole free roads Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.