టపాసులకు ఢిల్లీ వాతావరణానికీ అసలే పడ దని తేలిపోయింది. అంతకుముందు అందరూ అనుకున్నట్లు పంట వ్యర్థాలు కాల్చిన పొగ కాలుష్యానికి తాజాగా టపాసులు కాలుష ్యం వచ్చి చేరింది. గత యేడాది దీపావళి నాటి కన్నా ఈసారి ఢిల్లీలో కాలుష్యం (Pollution) కరాళనృత్యం చేసింది. న్యూఢిల్లీలో దీపావళి వేడుకల సందర్భంగా వాయుకాలుష్యం పెరిగిపోయింది. బాణసంచా పేలుళ్లతో వాయు నాణ్యత బాగా తగ్గిపోయింది. దీపావళి మరుసటి రోజున అంటే మంగళ వారం ఉదయం గాలి నాణ్యత సూచి ఐక్యూఐ 979గా నమోదైంది. ఈసారి ఢిల్లీ కాలుష్యస్థాయిపై గత అను భవాల రీత్యా ‘గ్రీన్ క్రాకర్స్ ‘కు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయినా కాలుష్య (Pollution) స్థాయిని స్థిరీకరించడం లేదా తగ్గించడం సాధ్యపడలేదు. గత యేడాది పండగ జరిగిన మరునాడు ఈ రీడింగ్ 296 క్యూఐతో పోల్చి చూసుకున్నప్పుడు తాజాగా ఎన్ని జాగ్రత్తలు తీసు కున్నా అతి ప్రమాదకరస్థాయిని చేరుకుందని కేంద్ర, కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. సోమవారం సాయంత్రానికి ఢిల్లీలో ఏక్యూఐ 345 వద్ద నిలబడి ఉందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రిసెర్చ్(సఫర్) వివరించింది. కాగా ఇలాంటి కాలుష్యం వల్ల ప్రజలకు శ్వాసకోస వ్యాధులు సోకే ప్రమాదముందని హెచ్చరించింది కూడా. ఈ గాలిని ఏ మాత్రం పీల్చినా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశముంది. గత యేడాది ఇంతకన్నా తక్కువ రీడింగ్ ప్రాణా పాయమున్నట్లు ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ సంస్థలు హెచ్చరించాయి. అయినా అనారోగ్యాల సంఖ్య తక్కువ స్థాయి నమోదై అప్పట్లో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఈసారి అలా కాదు. టపాసుల వేడుక ఎలాంటి ప్రమాదం తెచ్చిపడుతుందోననే భయంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా జోక్యం చేసు కొంది. గ్రీన్ దీపావళి కోసం చేయదగిన అన్ని సలహాలను,సూచనలనూ ఇచ్చింది. అయినా కాలుష్యం ఏ మాత్రమూ తగ్గలేదు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు విషయంలో పర్యావరణ ప్రేమికులు కాస్త తత్తర పడ్డారు. కారణం ఢిల్లీవాసులకు టపాసులు కాల్చుకోడానికి మాత్రమే అనుమతినిచ్చింది. పెరిగే వాతా వరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్న ఏ ప్రక్షాళన ప్రక్రియ ఢిల్లీ వాసులకు ఊరట కలిగించలేక పోయింది. దీపావళిని కేవలం బాణసంచా కాల్చుకోడానికే పరిమితం చేయరాదని అక్కడి ప్రభుత్వాలు ఎవరున్నా ఘోషిస్తుంటాయి. టపాసులు మీద గత ప్రభుత్వం విధిం చిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించి గ్రీన్ కాకర్స్ ను అనుమతించింది. గతంలోనూ ఇలాంటి సూచనలు సలహాలు ఉన్నప్పటికి ప్రజలు వాటిని పాటించలేక పోయారు. ప్రభుత్వం చతికిలపడిపోయింది. గాలి నాణ్య తను తగ్గించి, వాయుకాలుష్యం పెరిగే విషయం లో గతంలో ఎన్నడూ ప్రభుత్వ ప్రతిపాదిత పథకాలు కానీ కార్య క్రమాలు కానీ పూర్తిగా అమల్లోకి రాలేదు. దాంతో ఢిల్లీకి కాలుష్య బాధలు పెరిగిపోయాయి. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. కోర్టులు కూడా ఆరోగ్యంగా జీవించే హక్కు మాటున టపాసులకు అనుమతినివ్వడం మంచిదే. అయి నప్పటికీ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవ డమే అయింది. తమ అనుభవంలోకి వచ్చేసరికి న్యాయ కోవిదులకు సైతంకళ్లు తేలవేసే ప్రమాదం ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా రోగ్యం ఈ రెండూ ఏ సమా జానికైనా ముఖ్యమే. ఈ నేపథ్యంలోనే ఈయేడాది అక్టోబరు 15న సుప్రీంకోర్టు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ‘గ్రీన్ క్రాకర్స్’ను కాల్చుకో వచ్చని ఆదేశించింది. సాధారణ టపాసులతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ 30 శాతం నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీ రింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. వీటిలో అల్యూమినియం, బేరియం వంటి హానికర రసాయనాలు అతి తక్కువగా ఉంటాయి. కనుక ఢిల్లీ కాలుష్యానికి అడ్డుకట్ట వేయగలవని అందరూ భావించారు. ఇదే నమ్మకం తో అధికారుల అంచనాలతో ధర్మాసనం ‘గ్రీన్ క్రాకర్స్’ను అనుమతించింది. హానికరరసాయనాలు తక్కువగా ఉండే గ్రీన్ క్రాకర్స్ ను సుప్రీం కోర్టు అనుమతించి ఉండకపోతే సోమవారం నాటి రాత్రి బాణాసంచా పేలుళ్లు ప్రభావంతో ఎంతమంది ప్రజలు ఉక్కిరిబికి ్కరయ్యే వారో తలచుకుంటేనే ఆందోళన వ్యక్త మవుతోంది. టపాసులు కాల్చేందుకు నిర్దిష్ట సమయాలను కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. సాధారణ అపాయకర క్రాకర్స్ స్థానేతక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ‘గ్రీన్ క్రాకర్స్’నే వాడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమ లయ్యే విషయంలో ప్రభుత్వ శాఖల వైఫ ల్యం ఉండటం వల్లనే పూర్తిస్థాయి ఫలితం
దక్కలేదన్నది విమర్శ. తమ చుట్టూ ముంచుకొచ్చే కాలుష్య పొగలను తట్టుకునేందు కైనా ఢిల్లీ ప్రజలు గ్రీన్ క్రాకర్స్ ను వినియోగించి ఉండా ల్సిందే. వారే సహకరించకపోతే ఏ రీతిన ఢిల్లీ వాసులు కాలుష్య రహిత జీవనం సాగించగలరో ఆలోచించుకోవా లి. ఢిల్లీకి దరిదాపుల్లో ఉన్న పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగులబెట్టే అలవాటే ఆ ప్రాంతాన్ని కాలుష్యం తో ముంచెత్తుతోంది. ప్రస్తుతం పంట వ్యర్థాలను తగుల బెట్టే సమయం కూడా కాదు. దీపావళి బాణసంచాపై నిషేధాలున్నా లేకున్నా ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగి పోయింది. పట్టపగలు కూడా ఇల్లు విడిచి బయటకు రాలేని పరిస్థితికి గాలి నాణ్యత దిగజారిపోయింది. తాజా గా ఢిల్లీలో కాలుష్యస్థాయి ఎక్యూఐ 979ఉంది. కోల్కత్తా లో కూడా కాలుష్య సూచిక ఎక్యూఐ 350 ఉంది. కాలుష్యం తగ్గించడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపశ మనం లభించలేదంటే ఏం చేయాలో అంతర్జాతీయ నిపుణుల సహాయం తీసుకోవాల్సిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: