📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Polling Centers : నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో ఎస్ఈసీని కలిసి విజ్ఞప్తి చేసిన వైయస్ఆర్సిపి ప్రతినిధి బృందం

విజయవాడ (Polling Centers) : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో (ZPTC Elections) టీడీపీ అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల మార్పు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ వెంటనే ఈ అంశాలపై విచారణ జరిపి, తప్పు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పులివెందులలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించి, ప్రజాస్వామ్య విలువ లను కాపాడాలని విజప్తి చేసింది. అనంతరం వైయస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశం మొత్తం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణపై ఆసక్తితో చూస్తున్నారు. పులివెందులలో అధికార తెలుగుదేశం పార్టీ, వారికి అండగా నిలిచిన పోలీస్ యంత్రాంగం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం 10,600 ఓట్లు పోలయ్యే ఒక చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి దొడ్డిదోవన గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ బహిరంగంగా అన్ని విలువలను వదిలేసి, మొత్తం అధికార యంత్రాంగాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని, మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, శాయశక్తులా ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలని చేస్తున్న దుశ్చర్యలు బహుశా దేశంలోనే ఎక్కడా ఎవరూ చూసి ఉండరు.

వైయస్ఆర్సీపీ నాయకులను తప్పుడు కేసుల్లో పెట్టి, ఎన్నికల ప్రచారానికి వెళ్ళనివ్వకుండా బైండోవర్ అంటూ స్టేషన్ల లోనే రోజంతా నిర్భంధించడం చేస్తున్నారు. ఆఖరికి వైయస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరో నాయకుడు వేల్పుల రాములపై మారణాయుధాలతో దాడులు చేయడం, వారి వాహనాలపై పెట్రోల్పోసి నిప్పంటించేందుకు తెగబడటం చూస్తుంటే ఈ ఎన్నికపై అధికార తెలుగుదేశం ఎంతగా భయపడుతుందో అర్థమవుతోంది.. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన పద్నాలుగు నెలల పాలనను చూపి ఈ ఎన్నికల్లో ఓట్లు (Votes) అడిగే సాహసం చేయలేకపోతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఛీ కొడతారనే భయంతోనే ఉన్మాదంతో తన పార్టీ కార్యకర్తలను, రౌడీమూకలను ప్రతిపక్ష పార్టీ పైకి ఉసికొల్పుతోంది. తప్పులు చేసిన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ స్పందించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రెడుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలు చిత్తశుద్దితో పనిచేయకపోతే అరాచకం మాత్రమే మిగులుతుంది. కమిషనర్ కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా చెప్పడం జరిగింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/highways-complete-expansion-of-the-transportation-system-elimination-of-tribal-problems/andhra-pradesh/528688/

Election Monitoring Election Rules Violation Google news Latest News in Telugu polling centers Telugu News Today Vijayawada news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.