నటుడు శివాజీ హీరోయిన్లు, మహిళల వస్త్రధారణపై ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. శివాజీ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ పలువురు ప్రముఖులు స్పందించారు.. అలాగే తెలంగాణా మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులుజారీ చేసింది. ఆయన మహిళా కమిషన్ ముందు హాజరైన తన వివరణ కూడా ఇచ్చారు.. అలాగే తన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పారు.
Read Also: DGP Harish Kumar Gupta: ఈ ఏడాదిలో క్రైమ్ రేట్ తగ్గింది: డీజీపీ
అన్వేష్‌పై నెటిజన్లు ఆగ్రహం
అయినా సరే ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడలేదు. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ (Anvesh) స్పందించారు.. ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.అయితే, అన్వేష్‌పై (నా అన్వేషణ) కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని VHP ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతడిని అరెస్ట్ చేయాలని కోరారు.ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూట్యూబర్ అన్వేష్ (Anvesh) పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు ఆయన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాలను అన్‌ఫాలో చేస్తున్నారట.. దీనివల్ల ఆయన ఫాలోవర్ల సంఖ్య తగ్గుతోందని చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: