📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Today News : Polavaram – పునరావాస వసతులకు రూ.739 కోట్ల టెండర్లు

Author Icon By Shravan
Updated: September 5, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Polavaram : పోలవరం పునరావాస కాలనీల ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.739 కోట్లతో టెండర్లు పిలిచామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) వెల్లడించారు. పోలవరం నిర్మాణంతోపాటు భూసేకరణ, పునరావాసం పనులకు సమ ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ, పోలవరం పునరావాస పనులపై మంత్రి సమీక్షించారు.

పనుల పురోగతిపై సమీక్ష

ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. వర్షాకాలం, భారీ వరదల్లో సైతం డివాటరింగ్ చేస్తూ పోలవరం పనులు జరుగుతుండటంపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బట్రస్ డ్యామ్తో ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజ్ను కంట్రోల్ చేసి పనులు చేయగలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్యాప్రోక్పిల్ పనులపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు, అదే సమయంలో మోడల్ డ్యామ్ను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏజెన్సీతోపాటు స్వయంగా ఇరిగేషన్‌శాఖ ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీ, నాణ్యత పరికరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Polavaram – పునరావాస వసతులకు రూ.739 కోట్ల టెండర్లు

గోదావరి జలాల తరలింపుకు చర్యలు

పోలవరం ఎడమ, కుడి కాల్వల కనెక్టివిటీస్కు గ్యాంట్రీస్ సంఖ్యను పెంచి 2026 జూన్ కల్లా పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ రహదారుల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ (Irrigation Special) సెక్రటరీ జి సాయిప్రసాద్, ఆర్అండ్ఆర్ కమిషనరు రామ్సుందర్రెడ్డి, అడ్వైజరు వెంకటేశ్వరరావు, ఇఎన్ సి నరసింహమూర్తి, ఎస్ఇ, ఇఇలు, ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.

పోలవరం పునరావాస కాలనీల కోసం ఎంత మొత్తం టెండర్లు పిలిచారు?
రూ.739 కోట్లతో టెండర్లు పిలిచారు.

పోలవరం ఎడమ, కుడి కాల్వల కనెక్టివిటీ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారని తెలిపారు?
2026 జూన్ నాటికి పూర్తి చేస్తారని మంత్రి తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/cm-chandrababu-pawan-happy-over-reduction-in-gst-slabs/national/541579/

AP Minister Nimmala Rama Naidu Breaking News in Telugu infrastructure development Latest News in Telugu polavaram Polavaram Project Rehabilitation Colonies Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.