పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) ను శుక్రవారం కేంద్ర జల సంఘం ప్రతినిధులు పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జల సంఘం డిజైన్లు, పరిశోధన విభాగం ఎక్సఫిషియో సభ్యుడు ఆదిత్య శర్మ, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్ఎస్ భక్షిలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం(Raghuram) ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ జరుగుతున్న పనులను వారు ఆసాంతం పరిశీలించారు. వారికి జలవనరుల శాఖ ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ కె రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ విభాగం సిఈ కె శేషుబాబు, డీఈలు కె బాలకృష్ణ, డి.శ్రీనివాస్, ప్రేంచంద్, ఎం ఈ ఐఎల్ జిఎం ఏ గంగాధర్, డిజీఎం మురళి తదితరులు పనులు జరుగుతున్న తీరును చూపించటంతోపాటు వివరాలు అందించారు.
Read Also: Balakrishna: ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్
కేంద్ర బృందానికి జలవనరుల శాఖ
పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) పాయింట్ నుంచి మొత్తం పనుల వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థ ఎంఈ ఐ ఎల్ ప్రతినిధులు వివరించారు. ఆ తరువాత వారు మోడల్ డ్యామ్ పరిశీ లించారు. అక్కడ ప్రతి విభాగం గురించి అధికా రులుతెలిపారు. స్పిల్వే చేరుకున్న కేంద్ర బృందం మొత్తం పరిశీలించింది. స్పిల్ వే, గేట్లు, గేట్లను ఆపరేట్ చేసే సిలిండర్లు, పవర్ పాక్స్ మొదలైన వాటి పనితీరు గురించి వారు తెలుసుకున్నారు.
ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ కాఫర్ డాం, గ్యాప్ 1, డయాఫ్రమ్వాల్, జల విద్యుత్ కేంద్రం పను లను పరిశీలించారు.ప్రతి ఒక్క దగ్గర అధికా రు లను అడిగి పనులవివరాలు తెలుసుకున్నారు.\
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: