📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Polavaram: 7న పోలవరం అథారిటీ సమావేశం

Author Icon By Sushmitha
Updated: October 31, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: పోలవరం(Polavaram) ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) 17వ సమావేశం నవంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ హాల్‌లో పీపీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మరియు తెలంగాణ ప్రభుత్వాల నీటిపారుదల శాఖల అధికారులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. పీపీఏ మెంబర్ సెక్రటరీ ఎం. రఘు రామ్ ఇప్పటికే సభ్యులకు అజెండాను అందించారు.

Read Also: Women’s World Cup 2025: జీసస్ వల్లే ఈ విజయం: జెమీమా

అజెండాలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు పురోగతి, 2025-26 వర్కింగ్ సీజన్ యాక్షన్ ప్లాన్పై వివరించనున్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధిత ప్యాకేజీల పురోగతి, తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. కన్‌స్ట్రక్షన్ స్టేజ్ కోసం త్రిసభ్య కమిటీ రూపొందించిన ఎంవో (MOU) ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. కాగ్ ఆడిట్ అభ్యంతరాల నేపథ్యంలో 41.15 మీటర్ల నీటి నిల్వకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసి కేంద్రం ఆమోదానికి పంపనున్నారు.

అంతర్రాష్ట్ర వివాదాలు, కార్యాలయ మార్పు

పోలవరం ప్రాజెక్ట్(project) అథారిటీ హెడ్‌క్వార్టర్స్‌ను రాజమండ్రి (బొమ్మూరు)కు షిఫ్ట్ చేసే అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (P&CE) ఆఫీసు రాజమండ్రి నుంచి పని చేస్తుండగా, భవిష్యత్తులో ఆ కార్యాలయాన్ని అమరావతికి తరలించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణతో అంతర్రాష్ట్ర వివాదాలు, సబ్‌మెర్జెన్స్, డ్రైనేజీ కంజెషన్, భద్రాచలం-మణుగూరు ప్రొటెక్షన్ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. అలాగే, 27 కొత్త పోస్టుల (18 రెగ్యులర్ + 9 ఔట్‌సోర్సింగ్) నియామకాలకు ఆమోదం తెలుపనున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం ఎప్పుడు జరుగుతుంది?

నవంబర్ 7న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ హాల్‌లో జరుగుతుంది.

ఈ సమావేశంలో ఏ అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు?

41.15 మీటర్ల నీటి నిల్వకు సంబంధించిన మార్పులు, పీపీఏ హెడ్‌క్వార్టర్స్‌ను రాజమండ్రికి షిఫ్ట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Google News in Telugu inter-state issues Latest News in Telugu Polavaram progress Polavaram Project Authority PPA meeting Telangana. Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.