Polavaram MLA Chirri Balaraju Cyber Scam: జనసేన ఎమ్మెల్యేకు సైబర్ కేటుగాళ్ల టోకరా

Read Time:  1 min
polavaram-janasena-mla-chirri-balaraju-cyber-fraud-rta-challan-link
polavaram-janasena-mla-chirri-balaraju-cyber-fraud-rta-challan-link
FONT SIZE
GET APP

Polavaram MLA Chirri Balaraju Cyber Scam: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju) సైబర్ మోసానికి గురవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read Also: Srisailam: శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం.. నెల రోజుల్లోనే రూ. 7.19 కోట్ల ఆదాయం!

Polavaram MLA Chirri Balaraju Cyber Scam: ఒక్క లింక్.. 12 లక్షలు ఖాళీ

ఎమ్మెల్యే బాలరాజు మొబైల్‌కు ఆర్టీఏ (ఆర్టీఏ) చలానా చెల్లించాలంటూ ఓ మేసేజ్ రావడంతో అందులో ఉన్న లింక్‌ను ఆయన నిజమైనదని భావించి క్లిక్ చేశారు. ఆ లింక్ ద్వారా ఆయన ఫోన్‌లో ఓ మాల్వేర్ యాప్ ఇన్‌స్టాల్ అయినట్లు తెలుస్తోంది. అది క్లిక్ చేసిన కొద్దిసేపటికే, జంగారెడ్డిగూడెంలోని ఇండస్‌ఇండ్ బ్యాంకులో ఉన్న ఆయన ఖాతా నుంచి సుమారు రూ. 12 లక్షలు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు.

polavaram-janasena-mla-chirri-balaraju-cyber-fraud-rta-challan-link
polavaram-janasena-mla-chirri-balaraju-cyber-fraud-rta-challan-link

తన ఫోన్ హ్యాక్ అయిందని, ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్‌కు గురైన ఎమ్మెల్యే బాలరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐపీ అడ్రస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.