📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Telugu News: POCSO: మనవరాలిపై దారుణం చేసిన తాతకు 20 ఏళ్ల జైలు శిక్ష

Author Icon By Pooja
Updated: December 9, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయనగరం(Vijayanagaram) జిల్లా గాజులరేగలో జరిగిన అమానుష ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పును ఇచ్చింది. తన స్వంత మనవరాలిపై లైంగిక దాడి(POCSO) చేసిన బొండపల్లి సత్యారావు (59) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ₹5,000 జరిమానా, బాధిత చిన్నారి పునరావాసం కోసం ₹5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘోర ఘటన ఆగస్టు 18, 2025న బయటపడింది. ఇంట్లో పెద్దలు లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని సత్యారావు బాలికపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

Read Also: HYD Crime: హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

POCSO: Grandfather sentenced to 20 years in prison for abusing granddaughter

తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు – వేగంగా దర్యాప్తు

కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బాలిక తల్లి ఘటనను గుర్తించి బాలికను ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఆమె మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ జి. శిరీష పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆర్. గోవిందరావు పర్యవేక్షణలో దర్యాప్తు పూర్తిచేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

బలమైన వాదనలతో శిక్ష ఖరారు

కోర్టు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్(POCSO) ఖజానా రావు దృఢమైన ఆధారాలు, వాదనలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది. ఈ తీర్పు బాలలపై నేరాలకు రాష్ట్రవ్యాప్తంగా కఠిన హెచ్చరికగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు మరింత కఠిన చర్యలు, అలాగే చిన్నారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

APNews CrimeAgainstChildren Google News in Telugu Latest News in Telugu vijayanagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.