జిఎస్ఈపిలో ఎపి భేష్
రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ పియూష్ కుమార్
విజయవాడ : జాతీయ ఆర్థిక సర్వే 2025-26 మేరకు స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)తో సమాంతరంగా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్టిపి)లో ఏపీ మెరుగైన ఫలితాలను కన్పరుస్తుందని రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ పియూష్ కుమార్(PiyushKumar) పవర్ అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన మంత్రులు, కలెక్టర్లు సమావేశంలోన కేంద్రం వర్సెస్ రాష్ట్రం పోలిక అంశాలపై పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునరుద్దరణ దశలోకి ప్రవేశించింది. గత సంవత్సరం (2024-25)లో 6.5 శాతం ఉన్న స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు, ఈ సంవత్సరం 7.4 శాతానికి పెరిగింది. మధ్యకాలిక ఆర్థిక వృద్ధి సామర్థం సుమారు 7శాతంగా అంచనా వేయబడింది.
Read Also: Road Development: మన్యంలో రహదారి సంక్షోభం – ప్రజల ఆవేదన
ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండి, ఏప్రిల్-డిసెంబర్ 2025 మధ్యకాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.7 శాతంగా నమోదైంది. ఇది గత దశాబ్దంలో కనిష్ఠ స్థాయి. వ్యవసాయ రంగం 3.1 శాతం, పరిశ్రమ రంగం 7.0శాతం, సేవల రంగం 9.3శాతం వృద్ధి సాధించాయి. పెట్టుబడులు, వినియోగ వ్యయం మరియు బ్యాంకింగ్ రంగ స్థిరత్వం వంటి అంశాలు వృద్ధికి దోహదపడ్డాయి. మొత్తం స్థిర మూలధన నిర్మాణం (జిఎఫ్ సి) జిడిపిలో 30శాతం, బ్యాంకింగ్లో నికర ఎన్పీఏలు 2.2 శాతంకు తగ్గడంతో ఆర్థిక స్థిరత్వం బలపడింది. దేశ ఎగుమతులు (యుఎ) 825 బిలియన్లను దాటాయి. మౌలిక సదుపాయాల రంగంలో వేగవంతమైన(PiyushKumar) పురోగతి కనిపిస్తూ, హై స్పీడ్ కారిడార్లు 2014లో 550కిలో మీటర్ల నుండి 2026 నాటికి 5,364 కిలోమీటర్లకు పెరిగాయి. అలాగే భారత గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్ 2019లో 66వ స్థానంలో ఉండగా, 2025లో 38వ స్థానానికి మెరుగుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో స్థూల దేశీయ ఉత్పత్తి పరంగా 8వ స్థానంలో నిలిచింది. 2025-26లో రాష్ట్ర జిడిపి రూ.17,62,357 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది గత సంవత్సరం కంటే 10.75 శాతం వృద్ధి. రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.1,18,245 కోట్లు కాగా, అందులో స్వంత పన్ను ఆదాయం రూ.1,05,331 కోట్లు.
మొత్తం వ్యయం రూ.1,97,950 కోట్లు ఉండగా, ఇందులో ఆదాయ వ్యయం 90 శాతం, మూలధన వ్యయం 10శాతం. రెవెన్యూ లోటు రూ.60,481 కోట్లు, ఫిస్కల్ లోటు రూ.85,269 కోట్లు. రాష్ట్ర అప్పులు 35 శాతం, రాష్ట్ర స్వంత ఆదాయం 7.6 శాతం మాత్రమే ఉన్నాయి. ఇది ఒడిశా (13.3శాతం), ఛత్తీస్గఢ్ (12శాతం) కంటే తక్కువగా ఉండడం వల్ల రాష్ట్రం కేంద్ర నిధులపై అధికంగా ఆధారపడుతున్నదని సూచిస్తోంది. రాష్ట్ర ఆర్థిక దిశ సానుకూలంగా ఉంది. స్థిర ధరలపై జిఎస్ డిపి వృద్ధి రేటు 9.88 శాతం, ఇది జాతీయ సగటు 7.4శాతం కంటే ఎక్కువ. రంగాల వారీగా వ్యవసాయ అనుబంధ రంగం 10.14శాతం, పరిశ్రమ రంగం 9.15శాతం, సేవల రంగం 10.67శాతం వృద్ధి సాధించాయి. స్థూల రాష్ట్ర ఉత్పతిస్థిర ధరలపై రూ.9,52,261 కోట్లు, ప్రస్తుత ధరలపై రూ.17,62,357 కోట్లు. ప్రతి వ్యక్తి ఆదాయం రూ.2,94,507, ఇది గత సంవత్సరం రూ.2,66,699తో పోలిస్తే 10.43 శాతం వృద్ధి. వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. బియ్యం ఉత్పత్తి 126.68 లక్షమెట్రిక్ టన్నుల నుండి 146.09 లక్ష టన్నులకు (+15.3శాతం), మొక్కజొన్న ఉత్పత్తి 21.76నుండి 29.13 లక్ష టన్నులకు (+18.9), 34.33 38.59 (+12.4శాతం) పెరిగింది. పరిశ్రమలలో నిర్మాణ రంగం 14.18 శాతం వృద్ధితో ప్రధాన పాత్ర పోషించింది.
సేవలరంగంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ విభాగాలు 10-13 శాతం వృద్ధిని సాధించాయి. జిల్లాల వారీగా విశాఖపట్నం జిల్లా రాష్ట్ర స్థూల జిల్లా ఉత్పత్తిలో 9.1శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు మరియు జిల్లాల పనితీరును కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు ఆధారంగా పర్యవేక్షిస్తోంది. వీటిలో ఆదాయ వృద్ధి, వ్యయ సామర్థం, ప్రాజెక్టుల అమలు వేగం, ప్రజా సేవల నాణ్యత, పెట్టుబడుల ప్రభావం వంటి ప్రధాన సూచికలు ఉన్నాయి. “స్వర్ణ ఆంధ్ర లక్ష్యం 2030” ప్రకారం, రాష్ట్రం ప్రతి సంవత్సరం 15 శాతం వృద్ధి రేటు, రూ.31.06 లక్షల కోట్ల జిఎస్ డిపి, ప్రతి వ్యక్తికి రూ.5.15 లక్షల ఆదాయం సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత వృద్ధి ధోరణుల ప్రకారం, 2028-29 నాటికి రూ.27 లక్షల కోట్ల జిఎస్ పి సాధ్యం అవుతుందని అంచనా. కెపిఐఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత, ఫలితాల ఆధారిత నిర్ణయాలు మరింత బలోపేతం అవుతున్నాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: