విజయవాడ : పీహెచ్సీ వైద్యుల PHC Doctors డిమాండ్లు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీని గురించి సిఎం చంద్రబాబుతో చర్చిస్తామని వైద్యారోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ Health Minister Satyakumar Yadav హామీ ఇచ్చారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని కోరారు. ఈ మేరకు మంగళగిరి లోని తన క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్ పద్మావతి, వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్ రఘునందన్లతో శనివారం రాత్రి అత్యవసరంగా సమావేశ మయ్యారు. ‘ఇన్ సర్వీస్ కోటా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. టైంబౌండ్ పదోన్నతులు, ట్రైబల్ ఎలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి చర్చించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు ఇప్పటికే కమిటీ వేశామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Srisailam:దివ్యక్షేత్రం శ్రీశైలం – ఆధ్యాత్మికతకు నిలయం
PHC Doctors
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పిహెచ్సి వైద్యులు గత నెల 28 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 17 నుంచి ఈ నెల 2 వరకు నిర్వహించిన స్వస్ట్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ వైద్య శిబిరాల్లో 57.11 లక్షల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 26 జిల్లాల్లో నిర్వహించిన 25,192 వైద్య శిబిరాల్లో మహిళలు, పిల్లలు, వైద్య సేవలు పొందారని మంత్రి పేర్కొన్నారు. ‘ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం’ నినాదంతో ప్రధానమంత్రి నరేంద్రమోడి దేశ వ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించిన శిబిరాలతో ప్రజలకు మేలు జరిగిం దన్నారు.
10,225 మంది
రాష్ట్రంలోని 12.01 లక్షల మందికి బీపీ నిర్ధారణ పరీక్షలు, 11.42 లక్షల మందికి మధుమేహ, 9.70 లక్షల మందికి హిమోగ్లోబిన్,2.69 లక్షల మందికి టీబీ, 37,561 మందికి సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 83,541 మంది పిల్లలకు టీకాలు వేశారని, 10,225 మంది రక్తదానం చేశారని చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (పీఎంజేఏవై), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) కార్డులు 1.73 లక్షల మందికి పంపిణీ చేశారని వెల్లడించారు. అత్యథికంగా 3,603 శిబిరాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రథమ స్థానంలో, 3,237 శిబిరాలతో పశ్చిమ గోదావరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయని వివరించారు.
పిహెచ్సి (PHC) వైద్యులు ఏ డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు?
పిహెచ్సి వైద్యులు తమ ఇన్‌సర్వీస్ కోటా అమలు, టైంబౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు.
ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఏమని స్పందించింది?
వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్యుల డిమాండ్లపై సానుకూలంగా ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: