📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Latest Telugu News : Pensioners’ problems :పెన్షనర్ల సమస్యలకు ఏదీ పరిష్కారం?

Author Icon By Sudha
Updated: December 17, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా మూడు-నాలుగు దశాబ్దాల పాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్ అనేది దానం కాదు చట్టబద్ధ హక్కు. వారి చెమట, శ్రమ, అనుభవం దేశ నిర్మాణానికి పునాది. ఇలాంటి వృద్ధ ఉద్యోగుల కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్స్ డే జరుపుకుంటారు. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు వారికి గౌరవం, కృతజ్ఞత చాటి చెప్పే రోజు. ఈ సందేశాన్ని గుర్తు చేసుకుంటున్న వేళ, తెలంగాణలో పెన్షనర్లు ఎదురొఒంటున్న పరిస్థితులు మాత్రం హృదయ విదారకంగా ఉన్నాయి. చెల్లించాల్సిన బకాయిలు శూన్యం. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 16 వేలమంది ఉద్యోగ-ఉపాధ్యాయ పెన్షనర్లకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బకాయిలు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, టీఎస్ఎస్ఐ, సరెండర్ లీవ్, లీవ్ ఎన్్కష్ మెంట్ ఇవన్నీ ఒక్కరూపాయి కూడా విడుదల కాక పోవడం ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. జీవితాంతం క్రమశిక్షణతో సేవ చేసిన ఉద్యోగులకు రిటై ర్మెంట్ రోజునే ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎటూ తేల్చకుండా నెలల తరబడి నిలిపి వేయడం అమానవీయం కాదా? ఈ మొత్తాలు గృహం నిర్మించుకోవడానికి, వైద్యచికిత్సకు, అప్పులు చెల్లింపులకు ఉపయోగపడతాయని ఆశించిన వృద్ధులు నేడు అప్పుల దెబ్బకు, ఈఎంఐల ఒత్తిడిలో, అనారోగ్యంతో, మానసిక వేదనతో కుమిలిపోతున్నారు. వృద్ధాప్యంలో ఇలాంటి అవమానకర పరిస్థితి ఎవరికి రాకూడదు.ఆవేదనలో ఒత్తిడి గురైన కారణంగా ఇప్పటి వరకు సుమారు 28మంది పెన్షనర్లు మరణించడం ఈ సమస్య భయంకర తీవ్రతను చూపుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం మరణాల కంటే భయంకర మైన విషయం. పెన్షనర్ల జీర్ణించుకోలేకపోతున్నారు. సేవలో ఉన్నప్పుడు ఉద్యోగుల కోసం పోరాడిన సంఘా లు, నేడు అదే పెన్షనర్ల సమస్యలపై (Pensioners’ problems )నోరు విప్పకపోవడం ఘోర అవ మానం. వారి డిమాండ్లు అధికారిక జాబితాల్లో కూడా లేక పోవడం పెన్షనర్లలో తీవ్ర వేదన కలిగిస్తోంది.

Read Also: http://R. Krishnaiah: చట్టసభల్లో ఒబిసి రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం

Pensioners’ problems

రాష్ట్రవ్యాప్తం గా ఉద్య మం ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 2024 మార్చి తర్వాత పదవీ విరమణ చేసిన వృద్ధపెన్షనర్లు జిల్లాల వారీ గా ఐక్యమై రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ – తెలంగాణ (2024-25) రూపంలో రాష్ర్ట స్థాయిలో బకాయిల సాధన సమితిని ఏర్పాటు చేశారు. వైద్య సమస్యలతో, వయస్సు తో బాధపడుతున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేలు, మంత్రు లు, సీఎంఓ వరకు వినతిపత్రాలు సమర్పించారు. వాగ్దానాలకే పరిమితమై, అమలు మాత్రం కనిపించకపోవడం నిరాశ కలిగిస్తోంది. డిసెంబర్ 17 నాడు మనం పెన్షనర్లకు కృతజ్ఞత తెలియజేసే వేళ తెలంగాణలో వేలాది పెన్షనర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండటం ఎంత దురదృష్టకరం? జాతీయ పెన్షనర్స్ డే సందేశం స్పష్టం చేస్తుంది. పెన్షన్ భిక్షకాదు హక్కుదేశ నిర్మాణానికి సేవ చేసిన పెద్దలను తల్లి దండ్రుల్లా గౌరవించి వారికి రావాల్సిన బకాయిలను వెంట నే అందించడమే నిజమైన మానవీయ పాలనకు నిదర్శనం. ప్రజాప్రతినిధులు తమ వేతనాలు, అలవెన్సులు నిలిపివేస్తే? ఒకరోజు కూడా తట్టుకోవటం కష్టం. అయితే వేలాది వృద్ధుల రిటైర్మెంట్ బకాయిలను ఆర్థికలోటు పేరుతో నిలిపివేయడం ఎంత వరకు న్యాయం? రెండు మూడు పెన్షన్లు తీసుకునే వారు ఉన్న చోట, ఒక్క పెన్షన్కు నోచుకోని వృద్ధులకు రిటైర్మెంట్ బకాయిలు ఆలస్యం కావడం మానవత్వానికి ప్రశ్న. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బకాయి లను ఇవ్వ కపో వడం వల్ల పెన్షనర్ల (Pensioners’ problems ) మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. జాతీయ పెన్షనర్స్ డే సందేశాన్ని గౌరవించాలంటేరిటైర్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వం మాటలు కాదు? కార్యా చరణ చూపాలి.

-మెకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews government pensions latest news pension problems pensioners issues Retirement Benefits social security Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.