కోటబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) : రాష్ట్రంలో గత ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కారణంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు (Minister Kinjarapu) అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలం తులసిపేట గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇంటి ఇంటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లా డుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రూ.35 నుంచి ప్రారంభమైన పింఛను నేడు రూ.4 వేలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. 64 లక్షల మందికి రూ.34 వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం 1.20 లక్షల మందికి వితంతు పంఛన్లను తొలగించిందని, వాటిని నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పునరుద్ధరించామని తెలిపారు. వివిధ కారణాల రీత్యా కొన్ని తిరస్కరణ అయ్యాయని, వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి మంజూరు చేయడం జరుగుతందని హమీ ఇచ్చారు. ఒక్కరోజే 1.09 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, సంక్షేమ పథకాలతో దుసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రూ.3,156 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5వేలు, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తం 7,000 నేరుగా రైతుల ఖాతాలోకి వేస్తున్నట్లు తెలిపారు.
READ MORE :