📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Peddireddy Ramachandra Reddy: అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి

Author Icon By Saritha
Updated: March 16, 2026 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Peddireddy Ramachandra Reddy: వైసిపి నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇతర వైసిపి నాయకులతో కలిసి ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని విమర్శించారు. వైసీపీ (YCP) నేతలపై అక్రమ కేసులు పెట్టి రెండు ఏళ్ళుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హత్య కేసులో అసలైన నేరస్థులను వదిలిపెట్టి పిన్నెల్లి, ఆయన సోదరుడుపై అక్రమ కేసు మోపారని, గతంలో ఎస్పీ సైతం ఈ హత్య కేసులో వారికి సంబంధం లేదు అని చెప్పారని గుర్తు చేశారు.

Read Also: Tamilnadu Assembly Elections: విజయ్ – బీజేపీ పొత్తుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

Peddireddy Ramachandra Reddy: Remember that power is not permanent.

96 రోజులుగా జైలులోనే.. బెయిల్ రాకపోవడంపై ఆవేదన

96 రోజుల నుండి పిన్నెల్లి సోదరులు జైలు జీవితం అనుభవిస్తున్నారని, పిన్నెలి ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఛార్జ్ షీట్ వేసి 90 రోజులు పైన అయినా బైయిల్ రాలేదని అన్నారు. ఈ దుశ్చర్యకు తగిన ప్రతిఫలం చంద్రబాబు, లోకేష్ అనుభవిస్తారని ధ్వజమెత్తారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, రేపు వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే, ఇలాంటి చర్యలే పునరావృతం అవుతాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Nellore Central Jail Peddireddy Ramachandra Reddy Pinnelli Ramakrishna Reddy YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.