📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

విద్యకు రూ.2,506 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్

Author Icon By sumalatha chinthakayala
Updated: February 28, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని.. అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్‌ రూపొందించినట్లు చెప్పారు.

చంద్రబాబు.. ఆయనకు ఆయనే సాటి

2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు.. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పనులు పెద్దఎత్తున చేపడతామని చెప్పారు. మహారాష్ట్రకు ముంబయి, తెలంగాణకు హైదరాబాద్‌ ఎంత ముఖ్యమో.. మనకూ అమరావతి అంతే ముఖ్యమన్నారు. ప్రధాని మోడీ సహకారంతో ముంబయి, హైదరాబాద్‌ నగరాలకు సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల వెల్లడించారు.

బడ్జెట్‌లో కేటాయింపులు వివరాలు..

.నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
.పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
.ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు
.ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
.ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
.బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
.అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
.మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
.వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
.పంచాయతీ రాజ్‌ శాఖకు రూ.18,847 కోట్లు
.పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
.గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
.జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
.పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
.ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
.ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు
.యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
.గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
.తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
.మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
.జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం రూ.2,800 కోట్లు
.వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
.పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
.తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు (2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు)
.ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
.ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు
.దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
.మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
.స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
.డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
.ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు

annual budget assembly Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu payyavula keshav Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.