📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: AP High Court: వారందరికి వెంటనే డబ్బులు చెల్లించండి: ఏపీ హైకోర్టు

Author Icon By Aanusha
Updated: November 18, 2025 • 8:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనుల్లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా అజ్జంపూడి గ్రామానికి చెందిన రైతులు—మన్నం కృష్ణమూర్తి సహా నలుగురు—దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. భూసమీకరణ పథకం (Land Pooling Scheme) కింద ప్రభుత్వానికి తమ భూములను అప్పగించినా… ఇప్పటివరకు వాగ్దానం చేసిన కౌలు అందలేదని పిటిషనర్లు వాదించారు.

Read Also: Rain Alert: ఏపీలో వర్షాల హెచ్చరిక

Pay them all immediately: AP High Court

వాడుకోకపోయినా కౌలు చెల్లించాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది

భూసమీకరణ పథకం కింద గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని తప్పుపట్టింది హైకోర్టు (AP High Court). భూములను ఒకసారి స్వాధీనం చేసుకున్నాక, వాటిని వాడుకున్నా, వాడుకోకపోయినా కౌలు చెల్లించాల్సిందేనని హైకోర్టు (AP High Court) వ్యాఖ్యానించింది.

ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏను ఆదేశించిన న్యాయస్థానం, విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయంలో భూములు ఇచ్చిన ఇతర రైతులకు కూడా కౌలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు గుర్తుచేశారు. పిటిషనర్లకు కూడా వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh High Court CRDA issues farmers petition Gannavaram airport expansion land pooling dispute latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.