📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Pawan kalyan: ఎర్రచందనం అక్రమ రవాణాపై పవన్ కల్యాణ్ సమీక్ష

Author Icon By Rajitha
Updated: November 16, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం (Red Sandalwood) అక్రమ రవాణాపై కఠిన వైఖరి అవలంబించారు. శేషాచలం అడవులను రక్షించడం రాష్ట్రానికి అత్యంత ముఖ్యమని భావించిన ఆయన, అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించి, ఎర్రచందనం దుంగ ఒక్కటి కూడా అడవుల నుంచి బయటకు వెళ్లకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ సమయంలో స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ బలహీనపడటంతో భారీగా చెట్ల నరికివేత జరిగిందని పవన్ ఆరోపించారు. అక్రమ రవాణా మీద పూనుకున్న నెట్‌వర్క్‌ను పూర్తిగా కూల్చేయాలని, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న కింగ్‌పిన్‌లను చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Read also: Rain Alert: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Pawan kalyan: ఎర్రచందనం అక్రమ రవాణాపై పవన్ కల్యాణ్ సమీక్ష

ఎర్రచందనం అమ్మకాల ద్వారా

అక్రమ రవాణా అరికట్టడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని పవన్ కల్యాణ్ సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, చెక్‌పోస్టుల్లో పటిష్ఠ భద్రత వంటి చర్యలతో ఎర్రచందనం సంరక్షణను మరింత బలపరచాలని చెప్పారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా లభించే ఆదాయంలో కొంత భాగాన్ని వనాల అభివృద్ధికి వినియోగించే ఆలోచనను ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్ సహా ఇతర ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని తిరిగి రప్పించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు పవన్ తెలిపారు. అటవీ సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని, సమాచారం లీక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Pawan Kalyan Red Sanders smuggling Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.