📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu News: Pawan Kalyan: అటవీ భూముల ఆక్రమణపై.. వీడియో సందేశం

Author Icon By Tejaswini Y
Updated: November 13, 2025 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు జిల్లాలోని అటవీ భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కఠినంగా స్పందించారు. వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం మంగళంపేట అటవీ ప్రాంతంలో భూములను అక్రమంగా ఆక్రమించారని ఆయన ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, ఏరియల్ సర్వేలో మొత్తం 76.74 ఎకరాల అటవీ భూమి ఆక్రమించబడిందని తేలింది. ఈ భూములకు పెద్దిరెడ్డి కుటుంబం సంబంధం ఉందని పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిపినట్లు కూడా నివేదికల్లో ప్రస్తావన ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read Also: Chandrababu: టూరిజం హబ్‌గా విశాఖ.. నావీ సహకారం కోరిన సీఎం

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అటవీ భూములను ఆక్రమించిన వారి పేర్లు, కేసుల వివరాలు అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టంచేశారు.

అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి

సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్, “అడవుల్లో వారసత్వ భూములు ఎలా కలిగాయి?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అడవుల మధ్య ఉన్న భూమిని వారసత్వ ఆస్తిగా చూపడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూములు సర్వే నంబర్లు 295 మరియు 296లో ఉన్నాయని, రికార్డుల ప్రకారం భూమి విస్తీర్ణం 45.80 ఎకరాల నుంచి 77.54 ఎకరాలకు పెరిగిందని పవన్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వెబ్‌ల్యాండ్ డేటాలో అసమానతలు ఉన్నాయని గుర్తించారు. విస్తీర్ణం పెరగడానికి ఎవరి ప్రమేయం ఉందో వివరాలతో నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “అటవీ భూములు దేశ సంపద. వాటిని ఆక్రమించడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడం” అని పవన్ హెచ్చరించారు. సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని క్యాబినెట్‌కు సమాచారం అందించామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshPolitics ChittoorDistrict DeputyCM ForestDepartmen Latest News in Telugu PawanKalyan PawanKalyanNews TDP Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.