News Telugu: Pawan Kalyan: పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

Read Time:  1 min
The people of the constituency will be indebted to Pawan
The people of the constituency will be indebted to Pawan
FONT SIZE
GET APP

ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan) తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశేష విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అవసరం చెప్పిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నాయకుడిగా పవన్ కల్యాణ్ నిలుస్తున్నారని ప్రశంసించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 10 పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయడమే కాకుండా, ప్రాంతీయ ఆసుపత్రిని 250 పడకలకు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడి జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు.

Read also: AP: NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

The people of the constituency will be indebted to Pawan

The people of the constituency will be indebted to Pawan

జగన్ ప్రభుత్వంపై మంత్రి ఆనం తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా గత జగన్ ప్రభుత్వంపై మంత్రి ఆనం తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులు, అవినీతితో కుదేలుచేసిన పాలన అది అని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు సరైన స్పందన లేకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు రూ.32 వేల కోట్ల బకాయిలు పేరుకుపోతే, కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే రూ.12 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.