📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Pawan Kalyan – సీఎం చంద్రబాబు, టీజి సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ :’ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, (CM Chandrababu) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (TG CM Revanth Reddy) లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలియచేశారు. సినిమా పరిశ్రమలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణమని కొనియాడారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ కన్సర్ట్ కి అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించింది.

అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, డీజీపీ జితేందర్ కి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ కి లాల్ బహదూర్ ఈ స్టేడియం (Lal Bahadur Stadium) నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షం కురుస్తున్నా ఈ వేడుకలో ఎనలేని ఉత్సాహంతో అసంఖ్యాకంగా అభిమానులు పాల్గొన్నారు.

Pawan Kalyan 

వారు చూపిస్తున్న అభిమానం, ఉత్సహం మరువలేనిది వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకున్న శ్రేయాస్ మీడియా సంస్థ (Shreyas Media Company) కు, బందోబస్తు చేపట్టిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు.

చిత్రానికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సహచరులకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రానికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సహచరులకు, పోలీసు, రెవిన్యూశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్,వెబ్ మీడియా యాజమాన్యాలు (Web Media owners), ఫొటోగ్రావర్లు, వీడియోగ్రావర్లు, విలేకర్లకు కృతజ్ఞతలు.

‘ఓజీ’ చిత్ర రూపకల్పనలో ఎంతో తపించి పని చేసిన దర్శకుడు సుజిత్, నిర్మాతలు డివివి దానయ్య, మ్యూజిక్ దర్శకుడు తమన్, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు మనస్పూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Breaking News CM Chandrababu naidu Film Industry latest news OG Movie Pawan Kalyan Power Star Support Telangana Telugu News TG CM Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.