మహానుభావులు, గొప్ప నాయకులను కులాల కళ్లతో చూడటం మానుకోకపోతే భారతీయులుగా మన ఎదుగుదల సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అలా చేస్తే దేశంగా కాకుండా కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఆయన స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు(Amarajeevi Jaladhara project) పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Read Also: AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం

అంబేద్కర్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్(Ambedkar), మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి మహానీయులు సమాజం మొత్తానికి మార్గదర్శకులని, వారిని కుల పరిమితుల్లో బంధించడం సరికాదన్నారు. గతంలో పొట్టి శ్రీరాములు జయంతి రోజున నివాళులు అర్పించేందుకు వెళ్లినప్పుడు ఆయన విగ్రహం ఒక నిర్దిష్ట కులానికి చెందిన సత్రం వద్ద ఉందని చెప్పారని, అది తనను తీవ్రంగా కలచివేసిందని గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరి హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఒక జిల్లా లేదా ఒక కులానికి పరిమితం చేయడం తగదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మొత్తం ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్న ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.7,910 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. ఈ పథకానికి ‘అమరజీవి’ అనే పేరు పెట్టడంలో భావోద్వేగపూరితమైన కారణం ఉందన్నారు. తెలుగువారి ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తనకు ఆదర్శ నాయకులని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ ఈ పథకానికి ఆ పేరు నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: