📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest News: Pawan Kalyan: కురుపాం గురుకుల విద్యార్థినుల మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

Author Icon By Aanusha
Updated: October 5, 2025 • 10:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.

AP Govt: చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

విద్యార్థినులు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు అధికారులు తనకు వివరించారని పవన్ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థినులలో ఒకరు ఇంటి వద్ద, మరొకరు ఆసుపత్రిలో వేర్వేరు రోజుల్లో మరణించినట్లు తెలిసి తీవ్రంగా కలత చెందినట్లు చెప్పారు.

Pawan Kalyan

మరణించిన విద్యార్థినుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న 37 మంది విద్యార్థినులకు విశాఖపట్నంలోని కేజీహెచ్‌ (KGH) లో మెరుగైన చికిత్స అందిస్తున్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని

బాధిత విద్యార్థినులకు అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం (coalition government) తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.త్వరలోనే తాను స్వయంగా కురుపాం వెళ్లి గురుకుల పాఠశాలలోని పరిస్థితులను పరిశీలిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh News Breaking News Deputy CM Pawan Kalyan Gurukula school incident Parvathipuram Gurukulam deaths pawan kalyan statement student tragedy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.