📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan Kalyan: కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Author Icon By Sharanya
Updated: April 29, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సమయంలో, ఆ ఘటనపై కొందరు కాంగ్రెస్ నేతలు చూపిన ప్రవర్తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నివసిస్తూ విదేశీ శత్రు దేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ఆగ్రహం

మన దేశంలో పుట్టి, మన దేశంలో ఉంటూ కొందరు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇది దేశభక్తికి, జాతీయ ఐక్యతకు మచ్చలు పడేలా చేస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. ఎక్కువ మంచితనం చూపిస్తే, శత్రువు ఇంటికొచ్చి కాల్చేస్తాడు అని హెచ్చరించారు. దేశ భద్రతకు ఎవరైనా, ఎప్పుడైనా ప్రమాదం కలిగిస్తే, దానిని క్షమించరాదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ, మతం పేరుతో రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేయడం సరికాదు. కశ్మీర్ భారతదేశంలో భాగం. ఇలాంటి అంశాల్లో రాజకీయం చేయడం అత్యంత ప్రమాదకరం, అన్నారు. ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని కొందరు ఇండియాలో ఉండి పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారు. పాకిస్తాన్‌ను ప్రేమించేవాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవచ్చంటూ పవన్ సూచించారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదంటూ పవన్ చెప్పారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు..

మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం

పహల్గామ్ ఘటనలో హతమైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మధుసూదన్ కుటుంబానికి జనసేన తరపున రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు పవన్ కల్యాణ్. కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా, మధుసూదన్ పిల్లలకు అవసరమైన మానసిక మద్దతు కూడా అందిస్తామని తెలిపారు. సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన కుమారుడికి ఇప్పుడు అర్ధరాత్రి మేడపై నుంచి పడిపోతున్నట్టు కలలు వస్తున్నాయని అలాంటిది మధుసూదన్ పిల్లలకు ఎలాంటి ట్రామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు కానీ అందరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అతి మంచితనం చూపిస్తే ఇంటికొచ్చి కాల్చేస్తారన్నారు. భారతదేశంలో దాడి జరిగినప్పుడు సెక్యులరిజం అంటూ కాంగ్రెస్ నాటకాలు వేస్తే అంగీకరించేది కాదు. మతం ప్రాతిపదికన చంపుతాం అంటే చూస్తూ ఊరుకోము. అని హితవు పలికారు.

read also: Pahalgam Attack : ఉగ్రదాడి బాధిత కుటుంబానికి పవన్ రూ.50 లక్షల సాయం

#APPolitics #Janasena #PawanKalyan #PawanKalyanFires #PawanSpeech #PoliticalNews Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.