News Telugu: పంటపొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్: వన్ కల్యాణ్ కోడూరులో రైతులతో భేటీ అయ్యారు. మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోతకు సిద్ధమైన వరి పంట నీటిలో మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (pawan lalyan) గురువారం కోడూరుకు వెళ్లారు.
Read also: Uppada Beach: బంగారు రేణువుల కోసం.. ఎగబడ్డ జనం
News Telugu: పంటపొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్ పవన్ కల్యాణ్ స్వయంగా పంటపొలాల్లోకి దిగి వరి పంట స్థితిని పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి, వర్షాల వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న పవన్, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంట నష్టం అంచనాలు సక్రమంగా నమోదు చేసి, సహాయ చర్యలు త్వరగా ప్రారంభించేలా అధికారులను ఆదేశించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: