రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పల్లె ప్రజలకు శుభవార్త చెప్పారు. పల్లెల్లో రోడ్ల స్థితిగతులు, నిర్మాణ నాణ్యత, పనుల పురోగతి గురించి ప్రజలకు నేరుగా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ (‘Geo Rural Road Management System’) ను తీసుకురానుంది. ఈ సాంకేతిక వేదిక ద్వారా గ్రామీణ రహదారుల ప్రతి వివరమూ డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానుంది.
Read Also: e-KYC: ఈ -కేవైసి పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు రద్దు!
పల్లెపండగ 2.0లో భారీ రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెల్లడించిన వివరాల ప్రకారం, పల్లెపండగ 2.0 కార్యక్రమంలో ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో 4007 కిలోమీటర్ల రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనులు కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే కాకుండా, పల్లె ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడానికి కూడా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: