📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Pawan Kalyan: డ్రెయిన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

Author Icon By Rajitha
Updated: December 31, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అన్నం పెట్టే రైతుకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ (pawan kalyan) అన్నారు. మన రాష్ట్రం రైతు కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఉండాలన్నది కూటమి ఆకాంక్ష అని తెలిపారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గత నెలలో రాజోలు పర్యటనకు వెళ్లినప్పుడు సముద్రం పోటుతో శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఏ విధంగా సమస్యగా మారి కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయో చూశామన్నారు. మరో కొబ్బరి చెట్టు దెబ్బ తినక ముందే ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నా. ముక్కోటి ఏకాదశి రోజున శంకరగుప్తం డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Read also: APSRTC: ఇకపై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. విధానం ఇదే

Pawan Kalyan

కోనసీమ కొబ్బరి రైతుల సమస్య తెలియ జేసిన వెంటనే మనసుతో విని తక్షణం స్పందించి నిధులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్టి రోజు సమస్య తెలుసుకుని.. ముక్కోటి ఏకాదశి నాటికి పరిష్కరించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాజధాని ప్రాంతంలోని క్యాంపు కార్యాలయం ఈ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమంలో వర్చ్యువల్ గా పాల్గొన్నారు. రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శంకరగుప్తం నుంచి పాల్గొన్నారు.

డ్రెయిన్ సమస్యను పరిశీలన చేసేందుకు

రూ. 20.62 కోట్ల అంచనా వ్యయంతో శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ 8.50 కిలోమీటర్ నుంచి 16.50 కిలోమీటర్ వరకు ద్వారా పూడిక తీత పనులు, డ్రెయిన్ మొదలైన ప్రాంతం నుంచి 14.50 కిలోమీటర్ వరకు ఇరువైపులా గట్లు పటిష్టపరచడం తదితర పనులు చేపట్టనున్నారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిశీలన చేసేందుకు రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెం వచ్చినప్పుడు తలలు వాల్చిన కొబ్బరి తోటలు చూస్తే బాధ కలిగింది. రెండు దశాబ్దాల రైతుల ఆవేదన స్వయంగా విన్నాను. సుమారు లక్షన్నర చెట్లు మోడుబారిపోయిన విషయం తెలుసుకుని కలత చెందాను.

కొబ్బరి తోటలు లేని కోనసీమను ఊహించలేం. అక్కడ పరిస్థితి చూసి తిరిగి వచ్చిన వెంటనే సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లా. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి ఒక యాక్షన్ ప్లాన్ అవసరం అని వివరించారు. ఆయన సకాలంలో స్పందించి ఈ రోజున 35 రోజుల్లోపే రూ.20.77 కోట్లు కేటాయించి ముక్కోటి ఏకాదశి పర్వదినాన పనులు ప్రారంభించే అవకాశం కల్పించారు. డ్రెయిన్ ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించాలి. డ్రెయిన్ ఆధునికీకరణ చేయడంతో పాటు డ్రెయిన్ ఆక్రమణలు ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. శంకరగుప్తం డ్రెయిన్ లో 250 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు తెలిసింది. ఈ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలి.

కొబ్బరి రైతుల సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి

నవంబర్ 26న కేశవదాసుపాలెంలో పర్యటించినప్పుడు తక్షణ ఉపశమన చర్యల ఆవశ్యకతను గుర్తించాం. ఫైలు ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల ముందు ఉంచాం. ఆర్ధిక పరిస్థితి చూస్తే ఈ ఏడాది బడ్జెట్ కేటాయించేందుకు నిధుల సమస్య ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యను ప్రాధాన్యతాంశంగా స్వీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నిధులు మంజూరు చేయించుకోగలిగాం. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం..

నాడు కౌలు రైతుల కుటుంబాలకు భరోసా

పది మందికి అన్నం పెట్టే రైతుకు కష్టం వస్తే చాలా బాధ కలుగుతుంది. గతంలో ఒక ముక్కోటి ఏకాదశి రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ కౌలు రైతుల ఆత్మహత్యల అంశాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ రోజున కౌలు రైతుల కుటుంబాలకు ఎంత మేరకు సహాయం చేయగలం, వారి బతుకులకు భరోసా ఇవ్వాలని ఆలోచన నుంచే కౌలు రైతు భరోసా యాత్ర అనే గొప్ప కార్యక్రమం మొదలయ్యింది. అదే రోజు ఓ సినిమా ఒప్పుకొని, అప్పుడు వచ్చిన అడ్వాన్స్ డబ్బు రూ.5 కోట్లను కౌలు రైతుల కోసం ఇచ్చేసి కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించాం. మరికొందరు దాతల సహకారంతో కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తుంది. త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. ఆ దిశలోనే ఇప్పుడు శంకరగుప్తం డ్రెయిన్కి రూ. 20.77 కోట్లతో ఊపిరి పోయబోతున్నాం. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణతో వందలాది మంది కొబ్బరి రైతులకు ఉపసమనం కలుగుతుంది.

ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయినా..

భవిష్యత్తు నష్టాన్ని నివారించేందుకు ఆధునికీకరణ పనులు ఉపయోగపడతాయి.
ఈ కార్యక్రమానికి సహకరించిన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డ్రెయిన్లు, పంట కాలువల ఆధునీకరణకు సుమారు రూ.4 వేల కోట్లు అవసరం అని గత పర్యటనలో అధికారులు చెప్పారు. కోనసీమ ప్రాంతంలో డ్రెయిన్లపై నీటిపారుదలశాఖ నిపుణులు బి.సి. రోశయ్య గారి రిపోర్టుపై అధ్యయనం చేస్తున్నాం. నివేదిక వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చర్చించి డ్రెయిన్ల ఆధునీకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Pawan Kalyan Shankaraguptham Drain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.