📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Nandyal district development : పవన్ కల్యాణ్ చొరవతో కొణిదెల గ్రామం అభివృద్ధి దిశగా

Author Icon By Sai Kiran
Updated: February 21, 2026 • 8:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nandyal district development : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఆయన, వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా కోట్ల రూపాయల నిధులను సమీకరించారు. ముఖ్యంగా ఆయన అందించిన రూ.50 లక్షల విరాళంతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ గ్రామంలో తాగునీటి సమస్యను గణనీయంగా తగ్గించనుంది.

2019 ఎన్నికల ప్రచార సమయంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం నియోజకవర్గ పర్యటనలో రూ.50 లక్షల విరాళం అందజేసి, గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 2,000 మందికి సురక్షిత తాగునీరు అందనుంది. వేసవికాలానికి ముందే నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

Nandyal district development

గ్రామ అభివృద్ధి కోసం వివిధ పథకాల కింద రూ.6 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ‘పల్లె పండగ 1.0’ ద్వారా అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తికాగా, ‘పల్లె పండగ 2.0’ కింద సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ రహదారి అభివృద్ధి పథకం కింద పాఠశాల నుంచి లక్ష్మాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి భారీ నిధులు మంజూరు చేశారు.

అదనంగా గోకులాల నిర్మాణం, గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు, నీటి సౌకర్యాలు, రైతులకు ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి, మైనర్ కాలువల పునరుద్ధరణ, కమ్యూనిటీ చెక్ డ్యామ్‌ల మరమ్మతులు వంటి పనులు చేపట్టారు. గ్రామ ప్రజలు కోరిన అవసరాలను దశలవారీగా తీర్చుతూ కొణిదెలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

andhra pradesh rural development projects Breaking News in Telugu drinking water tank rural india Google News in Telugu gram vikas schemes andhra pradesh konidela village development andhra pradesh model village development india nandyal district development works pawan kalyan donation village pawan kalyan konidela village rural infrastructure development ap rural roads housing schemes india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.