భీమవరం డీఎస్పీ జయసూర్య(Jaya Surya)పై ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా ఆయన పనితీరుపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ చేసి సుమారు ఆరు నెలలు గడిచిన తర్వాత తాజా బదిలీ జరిగింది.
Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!
భీమవరం పోలీస్ శాఖలో మార్పులు
భీమవరం(Bhimavaram) పరిధిలో జూదశిబిరాలు విస్తరించాయని, కొన్ని సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు పవన్ కళ్యాణ్‌కు చేరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కూటమి నేతల పేర్లు ప్రస్తావిస్తూ కొందరి పక్షాన వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో చర్చించి, డీఎస్పీ పాత్రపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు పోలీసు అధికారుల మద్దతు ఉంటే కఠినంగా వ్యవహరించాలని, పోలీసులు సివిల్ వివాదాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. ఈ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందిస్తూ, తన సమాచారం మేరకు జయసూర్యకు మంచి సేవా రికార్డు ఉందని వ్యాఖ్యానించారు. జిల్లా స్థాయిలో జూదంపై కఠిన చర్యలు తీసుకోవడంతోనే ఆరోపణలు వచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
జయసూర్య స్థానంలో రఘువీర్ విష్ణు నియామకం
అయితే తాజా నిర్ణయంతో జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో రఘువీర్ విష్ణును నియమించింది ప్రభుత్వం. ఈ పరిణామం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: