Pawan Kalyan: జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

Read Time:  1 min
Pawan Kalyan: జనసేన నేతలపై పవన్ ఆగ్రహం
FONT SIZE
GET APP

మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొని మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదని, వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు చేయి తగిలినా అత్యాచారం చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారని పవన్‌ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.

Read Also: Jogi Ramesh Security : జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

Pawan Kalyan is angry with Jana Sena leaders
Pawan Kalyan is angry with Jana Sena leaders

కూటమి లక్ష్యాలపై దృష్టి

మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా, విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా,

కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పవన్ (Pawan Kalyan)పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.