BT Road Approval : మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో హృదయాన్ని తాకే సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఎంపికైన నూతన కానిస్టేబుల్ లాకే బాబూరావు, తన స్వగ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వేదికపైనే వినతి చేసుకున్నారు.
సామాన్య కానిస్టేబుల్ అభ్యర్థనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, ఈ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగానికి పేరుగాంచిన పవన్ కల్యాణ్, అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read also: CBN:రాజకీయాల్లో న్యాయం ఆలస్యం అయితే ప్రజాస్వామ్యానికి ముప్పు
డిప్యూటీ సీఎం సూచనలతో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి, బాబూరావు స్వగ్రామమైన తెనుములబండ నుంచి (BT Road Approval) ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలకు ఏఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ కూడా వెంటనే ఆమోదం తెలిపారు.
అత్యంత విశేషం ఏమిటంటే, సభ ముగిసేలోపే ఆ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కావడం. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ సమస్యను సీఎం, డిప్యూటీ సీఎం వేదికపై నుంచే స్వీకరించి, క్షణాల్లో పరిష్కరించడంపై ప్రజల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సంఘటన ప్రభుత్వ స్పందనకు, పాలనలో వేగానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: