📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan Kalyan: చిత్తూరులో ఏనుగుల దాడి.. రైతు మృతిపై డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలోని కొత్తూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అడవిలోంచి వచ్చి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు రైతు రామకృష్ణంరాజుపై దాడికి పాల్పడి, అతని ప్రాణాలను హరివేసింది. ఈ దారుణ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. రామకృష్ణంరాజు నిత్యం మాదిరిగానే పొలానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్థులు చెబుతున్నారు. హఠాత్తుగా గ్రామ సమీపంలోకి వచ్చిన ఏనుగుల గుంపు అతనిపై విరుచుకుపడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అలానే రైతు మృతికి నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు రామకృష్ణంరాజు మృతదేహాన్ని కదిలించేది లేదని వారంతా భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు డీఎఫ్ఓ (DFO) ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సంఘటన స్థలానికి వెళ్లారు.అయితే అటవీశాఖ నిర్లక్ష్యం వల్లే రైతు రామకృష్ణంరాజు చనిపోయాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఏనుగుల దాడిలో రైతు మృతి.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం

అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని

గ్రామస్తులు రాత్రి నుండి మృతదేహాన్ని తరలించడానికి నిరాకరిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు రామకృష్ణంరాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపేది లేదని తేల్చి చెప్పారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసనకు దిగారు.ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) కు తెలిసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు చనిపోవడం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సంఘటన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలానే చనిపోయిన రామకృష్ణంరాజు కుటుంబానికి పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

పవన్ కల్యాణ్ ఏ పార్టీకి చెందిన వారు?

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపకుడు అధ్యక్షుడు.

పవన్ కల్యాణ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు?

పవన్ కల్యాణ్ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: CM Chandrababu: పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏపీలో ఉంది

Andhra Pradesh Breaking News Chittoor district DFO Chittoor Elephant Attack farmer death Forest Department Kothuru village latest news Pawan Kalyan Ramakrishnam Raju Somala mandal Telugu News villagers protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.