ప్రపంచ కప్‌ను గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్(Cricket) జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారిణుల ప్రతిభను కొనియాడుతూ, వారిని ఘనంగా సత్కరించారు. విశ్వవిజేతలుగా నిలిచిన క్రీడాకారిణులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్, ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రతి క్రీడాకారిణికి పట్టుచీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు అందించి గౌరవించారు. అంధ క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు.
Read also: అంధ మహిళల విజయం..పవన్ ఘనసత్కారం
అంధ మహిళా క్రికెటర్ల విజయం పై పవన్ స్పందన
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్నారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని.. అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: