📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Pawan Kalyan: భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

Author Icon By Tejaswini Y
Updated: December 19, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Real Estate Scam: భూ మాఫియాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను అక్రమంగా ఆక్రమించిన ముఠాలు ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భూ కబ్జాలకు అండగా నిలుస్తున్న నేతలపైనా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన కోరినట్లు సమాచారం.

Read also: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్

భూ కబ్జాదారులపై ఉక్కుపాదం

కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తరాంధ్రలో భూ మాఫియా పెరుగుతున్న తీరును పవన్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్‌లో రెచ్చిపోయిన భూ మాఫియా ముఠాలు ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో పాగా వేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Pawan Kalyan complains to Babu to take action against land mafia

విశాఖ జోన్‌లో భూ కబ్జాల ఆరోపణలు: అధికారులకు సీఎం ఆదేశాలు

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు, ఐటీ సంస్థలు పెద్దఎత్తున వస్తుండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతోందని పవన్ వివరించారు. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో భూముల విలువ గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భూ మాఫియా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజలు తమ భూముల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం–డిప్యూటీ సీఎం స్పష్టీకరణ

ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), భూ వివాదాల్లో ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో భూ కబ్జాదారులపై మాత్రం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ఫిర్యాదు వచ్చినా పాత రికార్డులను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు.

భూ వివాదాల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులు లేదా ప్రొఫెషనల్ లిటిగెంట్స్‌ జోక్యం చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఉత్తరాంధ్ర భూములపై కొందరు నేతలు కన్నేశారని ఆరోపించారు. విశాఖ జోన్‌లో భూ కబ్జా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిపై కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics Chandrababu Naidu land grabbing Land Mafia North andhra Pawan Kalyan visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.