📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Pawan Kalyan: రజనీకాంత్‌ పేరే ఓ లెజెండర్: పవన్ కల్యాణ్

Author Icon By Sharanya
Updated: August 16, 2025 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినీ రంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. రజనీకాంత్ సినీ ప్రస్థానం ‘స్వర్ణోత్సవం’ జరుపుకుంటున్న ఈ సందర్భం అరుదైన గౌరవమని ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan

వెండి తెరపై అజరామరమైన ప్రభావం

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ, ‘‘థియేటర్ స్క్రీన్‌పై ‘సూపర్ స్టార్ రజని’ (Superstar Rajini) అనే టైటిల్ కనిపించగానే అభిమానులు చేసే సంబరాలు ఎన్నిసార్లు చెన్నైలో చూసాను. తరాలు మారినా రజనీకాంత్‌ గారి ఇమేజ్, అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి నటుడిగా ఆయన 5 దశాబ్దాల ప్రస్థానం విశేషమైంది’’ అని అన్నారు.

ప్రత్యేకమైన నటన, శైలి

రజనీకాంత్ ప్రతినాయకుడి పాత్రలోనైనా, కథానాయకుడి పాత్రలోనైనా తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన నడక, డైలాగ్ డెలివరీ, హావభావాలు ప్రత్యేకతను చాటుతూ కొత్త తరాల ప్రేక్షకులకూ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘సినీ ప్రస్థానంలో చెరగని ముద్ర (indelible mark on film industry)వేశారు’’ అని ఆయన ప్రశంసించారు.

నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరినప్పటికీ రజనీకాంత్ ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆయన జీవన విధానం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని తెలిపారు.

భవిష్యత్తుపై ఆకాంక్షలు

‘‘నటుడిగా స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ఘట్టంలో రజనీకాంత్ గారు మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింత కాలం సినీ రంగంలో వెలుగొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dharmavaram-nia-on-high-alert-over-dharmavaram-terror-attack-one-person-arrested/andhra-pradesh/530955/

50 Years of Rajinikanth Actor Milestone Breaking News latest news Pawan Kalyan PowerStar Rajinikanth Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.