📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై పేర్ని నాని ఫైర్

Author Icon By Sudheer
Updated: May 25, 2025 • 7:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర విమర్శలు గుప్పించారు. సినిమా టికెట్ల ధరలపై పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనే మాటల్ని మార్చారని ఆరోపించారు. అప్పట్లో “సినిమా మాది, మా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటాం” అన్న పవన్… ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలను బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో మరోలా వ్యవహరించడం సబబుకాదని నిప్పులు చెరిగారు.

చిత్ర పరిశ్రమను బెదిరిస్తున్నారా?

సినిమా శాఖను చేపట్టి పరిశ్రమకు మేలు చేస్తానని చెప్పిన పవన్… ఇప్పుడు అదే పరిశ్రమపై చర్యలకు పాల్పడటం దారుణమని పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. థియేటర్ల యాజమాన్యాలపై విచారణలు, బెదిరింపులు, జైలుకు పంపిస్తామన్న హెచ్చరికలు ప్రభుత్వ స్థాయిలో ఉండడం అప్రస్తుతం అన్నారు. “ఒక ఫ్లాప్ సినిమా విడుదలకే ఈంత హడావుడా?” అంటూ విమర్శలు గుప్పించారు. సినిమా పరిశ్రమను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైసీపీపై దూకుడు – సోమిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు

వైసీపీకి అంత్యక్రియలు చేస్తామంటూ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా పేర్ని నాని ఘాటుగా స్పందించారు. “అంత్యక్రియలు చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన ఘనత మీకే” అని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి రాలేదని బాధపడుతూ ఇలా విమర్శలు చేయడం బాధకరం అని అన్నారు. వాసంశెట్టి సుభాష్‌ను “పిల్ల గాడిద” అని సంబోధిస్తూ, ఆయన రాజకీయ వైఖరిని కూడా వ్యంగ్యంగా విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also : Miss World 2025 : ఫైనల్స్‌కు ఎంపికైన మోడల్స్ వీళ్లే

Google News in Telugu Pawan Kalyan perni nani tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.