📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Parvatipuram Manyam District: గురుకులంలో డయోరియా… ఆహారమే కారణమా ..?

Author Icon By Siva Prasad
Updated: February 27, 2026 • 11:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Parvatipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా వ్యాప్తి చెందడం కలకలం రేపుతోంది. ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read Also: TGSRTC: బస్‌పాస్‌లు ఇక డిజిటల్.. ‘మీ టికెట్’ యాప్‌తో

వైద్యులకు సమాచారం.. ఆస్పత్రికి తరలింపు
ఆరో తరగతి చదువుతున్న మండలి హేమలత, కోలక అనసూయ, కొండగొర్రె అనుశ్రీలకు డయేరియా లక్షణాలు కనిపించడంతో వెంటనే పాఠశాల ఆవరణలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న హారిక ప్రవళిక, శృతి దేవిలను మెరుగైన చికిత్స నిమిత్తం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి (CHC) తరలించారు.

Parvatipuram Manyam District: సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం

హాస్టల్‌లో సరఫరా అవుతున్న త్రాగే నీటిలో నాణ్యత లేకపోవడం, ఆహార పరిశుభ్రత పాటించకపోవడం వల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు, సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారని, ఆ ఘటన మరువకముందే ఇప్పుడు మళ్ళీ డయేరియా రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు అప్రమత్తమై తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Education News Diarrhea Outbreak in School Kurupam Gurukul School News Parvatipuram Manyam District Students Hospitalized Kurupam Tribal Welfare Hostel Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.