ముగ్గురిని బలగొన్న పడవ ప్రమాదం అప్పటివరకు వారంతా సరదాగా భోజనాలు చేశారు. ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆనందసాగరంలో మునిగితేలియాడుతున్నారు. సరదాగా నీళ్లలో దిగారు. నీళ్లలో కేరింతలాడారు. మరింత లోతుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే వారికి చివరి ఘడియ అని తెలియదు. వారి ఆనందం క్షణాల్లో విషాదంగా మారింది.
Read Also: Elon Musk: వైరల్ అవుతున్న టెక్ దిగ్గజాల ఏఐ ఫొటోలు
పార్వతీపురం (Parvathipuram Crime) మన్యం జిల్లాలో వనభోజనాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనంతగిరి మండలం జీనబాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. రైవాడ జంజవతి రిజర్వాయర్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరి మృతదేహం బయటపడింది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గల్లంతైన వారి కోసం గాలింపు
కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి ముందు పడవలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక సహాయక బృందాలతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. కార్తీన వనభోజనాల్లో భాగంగా జంజవతి రిజర్వాయర్ వద్దకు పిక్నిక్ కోసం సివిని గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వెళ్లారు. ఈ క్రమంలో ఆడుకుంటూ నలుగురు విద్యార్థులు రిజర్వాయర్ లోకి దిగారు.
ప్రమాదవశాత్తు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు (police) సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో సహాయకచర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని అధికారి గోవిందనాయుడు, అరసాడ ప్రదీప్, రాయగడ్ శరత్ గా గుర్తించారు. వీరంతా కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: