📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Parvathipuram Crime: ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

Author Icon By Rajitha
Updated: February 3, 2026 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రహస్యంగా అక్రమ రవాణా…

సాలూరు, (పార్వతీపురం మన్యం జిల్లా) : సర్కార్ ద్వారా పేదలకు అందవలసిన టన్నుల కొలది పీడీఎస్ బియ్యం ఆంధ్ర నుంచి ఒరిస్సాకు అక్రమంగా రవాణా అయిపోతున్నాయి. బంగారు భవిష్యత్ ఉన్న యువత జీవితాలను నాశనం చేసే గంజాయి ఒరిస్సా నుంచి ఆంధ్రతో పాటు ఇతర రాష్ట్రాలకు హద్దులు దాటి రవాణా సాగిపోతుంది. దీని వెనుక పెద్ద రాకెట్ నడుస్తోందని తెలుస్తోంది. ఇంత జరుగుతున్న ఇటు బియ్యం రవాణాన్ని గాని, అటు గంజాయి (Marjuna) రవాణాన్ని పోలీస్, విజిలెన్స్, ఎక్సైజ్ అధికారులు నియంత్రించలేకపోతుండడం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అక్రమార్కులకు పోలీసులే తెర వెనుక స్నేహ హస్తం అందిస్తున్నారా? లేదంటే అక్రమ రవాణాదారులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం, గంజాయి ఆక్రమ రవాణా నిత్యం సాగుతున్న అధికారులు అప్పుడప్పుడు మాత్రమే అక్రమార్కులను పట్టుకున్నట్లు. కేసులు నమోదు చేస్తున్నట్లు మీడియాకు వివరించడం పై సర్వత్ర ఆశ్చర్య వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉండగా పట్టణంలోని ఎక్కడపడితే అక్కడ శివారు ప్రాంతాల్లోనూ గంజాయి వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న పోలీస్ అధికారులు వాటి నియంత్రణకు పెద్దగా దృష్టి పెట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Read also: Kovvuru accident news : కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

ganja from Odisha to Andhra

చేతులు మారుతున్న పిడిఎఫ్ బియ్యం

సాలూరు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన బియ్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారుతుంది. పిడిఎస్ బియ్యం కేవలం పేదల వినియోగానికి మాత్రమే పంపిణీ చేస్తుండగా చేతుల భారీ భారీ స్థాయిలో అక్రమ రవాణా జరిగిపోతుంది. కొంతమంది రేషన్ డీలర్లతో పాటు పలువురు అక్రమార్కులు చేతులు కలిపి ఈ రేకటి నడిపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీని నియంత్రించడంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. పిడిఎస్ బియ్యం లారీ, బస్, ఆటోల ద్వారా ఒరిస్సాకు తరలిపోతుందనే విషయం జగమెరిగిన సత్యం. ఎందుకంటే డిపో బియ్యం విడిపించుకొని అక్కడే డీలర్లకు అమ్మడంతో అక్కడి నుండి బ్లాక్ మార్కెట్ కు చేరుతుందనేది ఓపెన్ సీక్రెట్.

మాస్ ఏరియా గల్లీల్లో గంజాయి పేకెట్స్ దందా

ఒరిస్సా హద్దలుదాటి గంజా పలు రకాలుగా ఆంధ్రలోకి అక్రమంగా రావడం ఇతర రాష్ట్రాలకు జిల్లాలకు తరలించి స్మగర్స్ సొమ్ము చేసుకోవడం నిత్య కృత్యం గా మారిందని బాహాటంగా వినిపిస్తుంది. సాలూరు పట్టణం లో పేకట్ల రూపంలో గంజాయి దొరుకుతుందనేది సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు ఒరిస్సా నుండి అక్రమంగా బ్యాగుల్లో గంజా ప్యాకెట్లు పెట్టుకుని పట్టణంలో ఉన్న మాస్ ఏరియాలోకి వచ్చి వ్యాపారం సాగిస్తున్నారని వినికిడి. గంజాయి మత్తులో పడి కొంతమంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవడం తో తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పోలీసులు, విజిలెన్స్, ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి బియ్యం గంజాయి అక్రమ రవాణా దార్లపై ఉక్కు పాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News Crime Investigation ganja smuggling latest news Odisha border PDS Rice Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.