📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Parthasarathy: పిపిపి మోడల్ సరైనదే

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై 18 నెలల్లో రూ.50వేల కోట్ల ఖర్చు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ను(AP) దేశంలోనే నంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని సమచార పౌర సంబంధాలు, (Parthasarathy) గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పీపీపీ అనేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విధానంగా మంత్రి అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ను విమర్శించడం, ప్రాజెక్టును గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన పీపీపీ విధానం వల్ల 50 సీట్లు మెరిట్ ప్రాతిపదికన కేవలం రూ. 15,500 ఫీజుతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కుతాయన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల కేవలం 35 సీట్లు మాత్రమే మన విద్యార్థులకు అందేవని, ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతుందన్నారు.

Read Also: YS Jagan: జగన్ కు అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు?

The PPP model is the right one.

విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన లాభాలు

పీపీపీ టెండర్లలో పాల్గొంటే జైలుకు పంపిస్తామనే విపక్షం బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి వివరించారు. (Parthasarathy) ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరుతున్నారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే 32 అదనంగా అప్పులు చేసిందని స్వయంగా కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్కు వెలువల, కార్పొరేషన్ల పేరుతో విచక్షణారహితంగా అప్పులు చేసిందని అన్నారు.. అప్పు తెచ్చిన నిధులను మూలధన వ్యయం కోసం కాకుండా కేవలం ఇతర ఖర్చులకే వినియోగించారని తెలిపారు. ముఖ్యంగా మోలిక సదుపాయాలను నిరక్ష ్యం చేసిందన్నారు. ఏ నాగరికత అభివృద్ధి అయినా రోడ్లపై కనిపిస్తుందని అంటారని, కానీ గత ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులను, కొత్త రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.

గృహ నిర్మాణ పథకాల్లో కూటమి ప్రభుత్వ ప్రగతి, సవాళ్లు

డ్రైనేజీ కాలువలు, కాలువల నిర్వహణ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, దీనివల్ల వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం అమలు తీరు, ఎదురవుతున్న సవాళ్లు మరియు భవిష్యత్ ప్రణాళికలపై మంత్రి వివరిస్తూ. ప్రభుత్వం ఇళ్ల స్థలాలను శ్మశానాలు, కొండ వాలు ప్రాంతాలు, నదులు, కాలువల సమీపంలో కేటాయించడం వల్ల ప్రజలు అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదన్నారు. అనేక కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఇళ్లను ప్రారంభించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. 2014 2019 మధ్య కాలంలో దాదాపు 5 నుండి 6 లక్షల కుటుంబాలకు మంజూరైన గృహాలను గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో రద్దు చేసి పేదలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పటివరకు 18.5 లక్షల ఇళ్లు మంజూరు కాగా, గత ప్రభుత్వం కేవలం 6.5 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government Chandrababu Naidu HealthCare Kolusu Parthasarathi Latest News in Telugu medical colleges ntr bharosa pension PPP model Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.