Panchayat Voter List: పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందే

Read Time:  1 min
Panchayat Voter List: పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందే
FONT SIZE
GET APP

Panchayat Voter List: పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణకు నాలుగు వారాల గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని తోసిపుచ్చారు. గడువు పెంచేందుకు సరైన కారణం లేనందున, పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందేనని ఆమె పునరుద్ఘాటించారు. ఆలస్యమైన పంచాయతీల విషయంలో పునఃసమీక్షించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖకు ఎస్ఈసీ బుధవారం సమాధానమిచ్చారు.

Read Also: Job Calendar : 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇవ్వబోతున్న ఏపీ సర్కార్

Panchayat Voter List: పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందే
Panchayat Voter List: Voter lists must be published in Panchayats

ప్రభుత్వం కోరిన గడువును తోసిపుచ్చిన ఎస్ఈసీ

ఎలక్టోరల్ మేనేజ్మెంట్ సిస్టంలో కొత్త సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఆధారంగా పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాలన్న ఎస్ఈసీద ఆదేశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఇటీవల లేఖ రాశారు. కొత్త విధానంతో పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సాంకేతికంగా పలు సమస్యలు తలెత్తుతున్నట్లు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిని అధిగమించేందుకు నాలుగు వారాల గడువు పెంచాలని కోరారు. ఆయన లేఖపై ఎస్ఈసీ బదులిచ్చారు. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన ప్రధాన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

13,3551 పంచాయతీల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో జాబితాల ప్రచురణకు గడువు పొడిగించేందుకు మీరు చెబుతున్న కారణం సహేతుకంగా లేదని కమిషన్ భావిస్తోంది. అందువల్ల ఓటర్ల జాబితాల ప్రచురణకు ఈ ఏడాది మార్చి 7న ఇచ్చిన ఆదేశాల అమలులోనే ఉంటాయి. సాంకేతిక, ఇతర కారణాలతో కొన్ని పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ ఆలస్యమైతే అలాంటివి పరిశీలించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిస్తాం అని ఎస్ఈసీ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.