📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

Author Icon By Sharanya
Updated: July 8, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretaries) సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఎపి ఎన్జఒ రాష్ట్ర అధ్యక్షులు, జెఎసి ఛైర్మన్ ఎ విద్యాసాగర్ (JAC Chairman A Vidyasagar) కోరారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యచరణ కమిటీకి ఇచ్చిన వాగ్దానం మేరకు పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎపి ఎన్జఒ రాష్ట్ర అధ్యక్షులు, జెఎసి ఛైర్మన్ ఎ విద్యాసాగర్ కోరారు.

ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం

రాష్ట్రస్థాయి పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం (Working Committee Meeting) విజయవాడలోని ఎపి ఎన్ జిఒ హోమ్ లో జరిగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretaries) సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించామన్నారు. మొత్తం 6 గ్రేడ్లను 3 గ్రేడ్లకు కుదించాలనే ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులపై రోజురోజుకూ పెరుగుతోన్న ఒత్తిడిని తగ్గించేందుకు సమయపాలనలో మార్పులు చేయాలని కోరారు. పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్లు వీడియో కాలింగ్ చేయాలన్న విధానాన్ని తొలగించాలని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎపి ఎన్జఒ రాష్ట్ర కార్యదర్శి డివి రమణ తదితరులు పాల్గొన్నారు .

పంచాయతీ సెక్రటరీ యొక్క ప్రాథమిక విధులు ఏమిటి?

ప్రతి రాష్ట్రం సంబంధిత రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి నిర్దిష్ట నియమాలు మరియు విధులను కేటాయించవచ్చు. బాధ్యతలలో సాధారణంగా రికార్డుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ మరియు గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలు ఉంటాయి.

పంచాయతీ సెక్రటరీ యొక్క ప్రాథమిక విధులు ఏమిటి?

ప్రతి రాష్ట్రం సంబంధిత రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి నిర్దిష్ట నియమాలు మరియు విధులను కేటాయించవచ్చు. బాధ్యతలలో సాధారణంగా రికార్డుల నిర్వహణ, ఆర్థిక నిర్వహణ మరియు గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలు ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: V. Srinivasa Rao: మామిడి రైతులను ఆదుకోండి -సిఎం చంద్రబాబుకు సిపిఎం లేఖ

AP Panchayat Secretary Breaking News latest news Panchayat Secretaries Panchayat Secretary Issues Panchayat Staff Protests Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.