📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Panchayat raj : పల్లెల ప్రగతియే దేశాభివృద్ధికి సూచిక

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్రామంలో ప్రజాస్వామ్యం వికసించి, అది స్వయం సమృద్ధి సాధించినప్పుడే జాతి అభివృద్ధి చెందుతుం దన్నారు మహాత్మ గాంధీ. అందుకే గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో స్వయం పాలన గావించడానికి పంచా యితీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి దిశగా పయనిస్తాయి. గ్రామాభివృద్ధి అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహాయ సహకారాలతో ముడిపడి గ్రామపాలన గావించే గ్రామ ప్రథమపౌరుడు (సర్పంచ్)పై ఆధారపడి ఉంటుంది. బీసీల 42శాతం రిజర్వేషన్స్ కార ణంగా న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో కాస్తా ఆల స్యమైన ఎన్నో అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ప్రభుత్వం నవంబర్ 17న జరిగిన కేబినెట్ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1నుండి 9 వరకు ప్రజాపాలన విజ యోత్సవాలు నిర్వహించి, డిసెంబర్ రెండవ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వేసి స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. గ్రామాలలో విభిన్న రాజకీయపార్టీలకు చెందిన నాయకత్వం రిజ ర్వేషన్ పరంగా అభ్యర్థులను ఖరారుచేసి ఇప్పటికే ఎవరికి వారు అంతర్గత ప్రచార కార్యకలాపాలలో నిమగ్నమై ఉండ టం గమనించవచ్చు. ఈ ఎన్నికలలో ఎన్నో వింతలను అంటే ఒకే కుటుంబానికి చెందిన ఇరువురి వ్యక్తులను అన్నా తమ్ముడు, అన్న చెల్లి, తల్లి కొడుకు, అత్త కోడలు బరిలో నిల్చోవడం లాంటి సంఘటనలను చూడవచ్చు. అలాగే ఈ ఎన్నికలలో ఒకవైపు అధికారపార్టీ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, మరొకవైపు ప్రతిపక్షపార్టీ బలోపేతం కావడానికి ప్రయత్నంలో భాగంగా డబ్బుఏరులై పారనుంది. ఓటర్ల ను ఆకర్షించడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్నో నెరవేరలేని హామీలుస్తూ, బతిమిలాడుతూ, భయ పెడుతూ, బహుమతులనిస్తూ ప్రచారం చేస్తుంటారు. వాస్త వానికి గ్రామాలలో ఎన్నికయ్యే సర్పంచ్ పైననే గ్రామాభి వృద్ధి ఆధారపడి ఉంటుంది.

Read Also : Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన సన్నద్ధం

Panchayat raj

గ్రామ ప్రథమ పౌరుడంటే..

గ్రామ ప్రథమ పౌరుడంటే ఇంటికి పెద్దదిక్కువలే గ్రామానికి పెద్ద. గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించి నిరంతరం వారి క్షేమం, సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుండాలి. అంతేగానీ ఏదో హోదాకోసమో ఆర్థికపరమైన వ్యాపారంగా భావించి లక్షలలో ఖర్చుపెట్టి వడ్డీతో సహాసం పాదించుకోవాలనో ఎన్నికలలో పోటీచేయవద్దు. గ్రామప్రజలు సైతం పార్టీలు, కులాలు, మతాలకతీతంగా డబ్బుకు ఎలాంటి ప్రాధాన్యత నివ్వకుండా, సేవాదృక్పథం కలిగి గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకున్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఏదిఏమైనప్పటికి ఫిబ్రవరి మాసం నుండి యావత్తు తెలంగాణ రాష్ట్రమంతట నూతనంగా సర్పంచులు, ఉప సర్పం చులు, వార్డుమెంబర్లు నియామకం కాబోతున్నారు. కావున వారి విధుల నిర్వహణ, అభివృద్ధిపై సరైన అవగాహన ఏర్పర్చుకొని, గతంలో చరిత్ర సృష్టించిన కొన్ని విషయాలను పరిశీలిస్తూ అవగతం చేసుకుంటూ, ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా హాజిపల్లి గ్రామపంచాయతీకి (Panchayat raj) గ్రామ ప్రథమపౌరురాలి గా ఎన్నికై గ్రామంలోని వీధులన్నీ సిమెంట్ రోడ్లతో నిర్మిం చి, ప్రతివీధికి భూఅంతర్భాగం ద్వారా మురికి కాలువలను నిర్మించి, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించి, పిల్లలకు పాఠశా లలను, అంగన్వాడీ కేంద్రాలను, గ్రామపంచాయితీ (Panchayat raj) భవనాన్ని, గ్రంథాలయాన్నీ నిర్మించి 2008లో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు (రాష్ట్రపతి) శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా నిర్మల గ్రామ పురస్కారాన్నీ అందుకున్నారు. అదే సంవత్సరం నవంబర్ మాసంలో రాష్ట్రప్రభుత్వం నుండి ‘శుభ్రం’ అవార్డు పొందడం అనేది మిగతా గ్రామ ప్రథమ పౌరులకు ఆదర్శం. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామ చంద్రపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం, మహారాష్ట్ర లోని అహ్మదనగర్ జిల్లాలోని హైవేర్ బజార్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తే గ్రామ సభలను విజ యవంతంగా జరిపి, పలు సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ, ఆ సభలలో గ్రామంలోని ప్రతి ఒక్కరిని హాజర య్యేటట్లు చేసి, గ్రామాభివృద్ధికి కృషిచేశారు. గంగాదేవిపల్లిలో 18రకాల వివిధ కమిటీలను గ్రామసభ ద్వారా శుద్ధమైన త్రాగునీరు కమిటీ, పారిశుద్ధ కమిటీ, ఆరోగ్యా కమిటీ, సమా చార కమిటీలు మొదలగు వాటిని ఏర్పాటు చేసి ఎవ్వరికి ఏ విషయంలో సమస్య వచ్చినా, తగిన కమిటీలను సం ప్రదించి సులభంగా పరిష్కరించుకునే విధంగా యంత్రాం గాన్నీ ఏర్పాటుచేసి అభివృద్ధికి దోహదపడటం జరిగింది. పాఠశాలకు వెళ్ళే వయసు వచ్చిన బాలబాలికలను పాఠశాల లలో చేర్పించేటట్లు యంత్రాంగాన్ని తయారు చేసి గ్రామంలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేస్తూ విజయవంతంకావడం. ప్రతిఇంటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందే టట్లు చూడటం.

అభివృద్ధిలో పరుగులు

జనాభా నియంత్రణలో భాగంగా దంపతు లను ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోచాలని ప్రోత్సహిస్తూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించడం. గ్రామంలోని ప్రతి పసిపిల్లలకు ప్రభుత్వం తరుపున అందించే పోలియో చుక్కలు, టీకాలు, వివిధ వ్యాక్సిన్లు సకాలంలో అందరికి అందేటట్లు చూడటం. గ్రామంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకులో ఖాతా తెరిచి నగదు నమోదు చేసుకోవడానికి ప్రోత్సహించడం. గ్రామంలో పారిశుద్ధానికి అధిక ప్రాముఖ్యత నిస్తూ, ఎవ్వరికి ఎలాంటి అంటూ రోగాలు రాకుండా జాగ్రత్త పడటం. గ్రామంలో అందరి సమేతంగా మధ్యపానాన్ని నిషేధించి అభివృద్ధిలో పరుగులు తీసేవిధంగా తీర్చిదిద్దడం అనేది యావత్తు రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇలాంటి కార్యక్రమాల గురించి సర్పంచ్ బరిలో ఉన్నటువంటి అభ్య ర్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరీ ముఖ్యంగా గ్రామాలలో జరిగే ఈ పంచాయితీ ఎన్నికలలో స్నేహపూరిత పోటీని కలిగివుండాలే తప్పా, ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఛాలెంజ్గా తీసుకోని అధిక ధనాన్ని ఖర్చుచేసి, మద్యాన్ని ఏరులై పారిస్తూ, తను నష్టపోయి, ఇతరులను ఇబ్బందులపాలు చేయకుండా చూసుకోవాల్సిన భాద్యత వారిపైనే ఉన్నది. గ్రామంలోని ప్రజలంతా కలిసికట్టుగా వుండి అభివృద్ధిని కాంక్షిస్తూ, వీలైతే ఎలాంటి ఎన్నికలు లేకుండా నిస్వార్థపరుడిని, గ్రామ క్షేమం, సంక్షేమం, అభి వృద్ధిని కాంక్షించే వ్యక్తులను ఎన్నుకోవడం ఎంతో మంచి పరిణామం. ఎలాంటి కక్షలు, కుట్రలు లేకుండా, ఎన్నికల అధికారులతో సహకరిస్తూ, పంచాయితీ ఎలక్షన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై వున్నది. ప్రశాంత వాతావరణం లో, మరెంతో ప్రశాంతంగా ఎన్నికలలో పాల్గొంటూ ఒకమంచి వ్యక్తిని గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నుకొని గ్రామా భివృద్ధికి దోహదపడాలని ఆశిద్దాం.
– డా. పోలం సైదులు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News India Development latest news local governance Panchayat Raj Rural Development Telugu News Village Progress

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.