📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest Telugu News : Panchayat : పేరొకరిది, పెత్తనం మరొకరిది

Author Icon By Sudha
Updated: December 10, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు రెండు దశాబ్దాలుగా స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, ‘మీసాల రాయుళ్ల పెత్త నం కొనసాగుతూనే ఉండటం ప్రజాస్వామ్యవ్యవస్థకు ఆందోళన కలిగించే విషయం. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్ని కల నగారా మోగిన నేపథ్యంలో, ఈ రిజర్వేషన్ల ఆంతర్యం నెరవేరుతుందా లేదా అనేది మరోసారి చర్చనీయాంశమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3) (పంచాయతీలకు) (Panchayat ) 243(3) (మున్సిపాలిటీలకు) మహిళలకు కనీసం మూడింట ఒక వంతు (1/3) స్థానాలను రిజర్వ్ చేయాలని నిర్దేశిస్తున్నాయి. ఈ కనీస నిబంధనను దాటుకొని, తెలం గాణ రాష్ట్రం 2015లో జీహెచ్ఎంసీలో మొదలుపెట్టి, గ్రామ పంచాయతీ (Panchayat) , ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకంగా 50 శాతంరిజర్వేషన్లను కల్పించడం ఒక ప్రగతిశీల నిర్ణయం. 2006లోనే బీహార్ ఈ చారిత్రక చట్టాన్ని తీసుకొ చ్చింది. మహిళలను కేవలం అభ్యర్థులుగా కాకుండా, నిర్ణయాధికారులుగా మార్చే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. కానీ, క్షేత్రస్థాయి వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు స్థానిక సంస్థల్లో గెలిచిన మహి ళా ప్రజాప్రతినిధులు కేవలం ‘స్టాంప్ వేసే బొమ్మల’ లాగా మారిపోయారు. కార్యాలయ రికార్డులపై సంతకాలు చేయడా నికి మాత్రమే వారు పరిమితమయ్యేవారు. అభివృద్ధిపనులు, నిధుల కేటాయింపు, అధికారిక సమావేశాలు అన్నింటా వారి భర్త, కుమారుడు లేదా కుటుంబ సభ్యులే అధికారాన్ని చెలాయించేవారు. ఈ ‘మీసాల రాయుళ్లు’ అధికారిక కార్యక్రమాల లోముందు వరుసలో కూర్చుని, సర్పంచ్/ఛైర్పర్సన్ల తరపున ఆదేశాలు జారీ చేయడం సర్వసాధారణ దృశ్యంగా మారింది.

Read Also: http://AP Sachivalayam: గ్రామ–వార్డు సచివాలయాలకు ఐవీఆర్‌ఎస్‌ సర్వే

Panchayat

మహిళల ఆత్మగౌరవాన్ని, ప్రజాస్వామ్య విలువ లను అనేక సందర్భాల్లో అణిచివేసిన ఈ పరిస్థితిని సమాజం చూస్తూనేఉంది. ఇప్పటికీ, 50శాతం రిజర్వేషన్లు అమ లులోకి వచ్చినా, ఆ స్థానాల్లో పోటీ చేసే వారిలో అధిక శాతం మంది తమ కుటుంబ సభ్యుల రాజకీయ వారసత్వా న్ని లేదా అధికారాన్ని నిలబెట్టడానికి నిలబడే వారే తప్ప, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే మహిళా నాయకులు ఇంకా తక్కువగానే కనిపిస్తున్నారు. నేటి ఆధునిక, విద్యావంతమైన సమాజంలో ఈ పరిస్థితి మారాలి. మహిళా రిజర్వేషన్ విజయవంతం కావాలంటే, మహిళలు కేవలం కోటాకు పరిమితం కాకుండా, స్వశక్తితో ఎదగాలి. ప్రస్తుత, గత రాజకీయ పరిస్థితులు, స్థానిక పాలన చట్టాలు, ప్రభుత్వ పథకాలు గ్రామాభివృద్ధి ప్రణాళికలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. కొన్నింటిలో ఇంటి సభ్యుల సలహాలు తీసుకోవడం సరైందే అయినప్పటికీ, పరిపాలనా పరమైన నిర్ణయాలు, పనుల అమలు విషయంలో స్వతంత్రంగా వ్యవహరించడం అలవర్చుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయివంటి వనితల నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని, భయం లేకుండా, ఆత్మవిశ్వా సంతో ప్రజాసేవకు కంకణం కట్టుకోవాలి. చివరిగా, రాజకీయాలు కేవలం పురుషులకోసం అనే పాత నమ్మకాన్ని తొల గించే బాధ్యత పౌరులందరిపై ఉంది. మహిళలను రాజకీ యాల వైపు ఆకర్షించి, రేపటి భారతదేశ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమవ్వడానికి సమాజం తోడ్పాటు అందించాలి.
– కందుకూరి రాకేష్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news local governance panchayat Power Dynamics Rural Politics Telugu News Village Administration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.