అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) దిశానిర్దేశం విజయవాడ : ఏపీలో గ్రామీణ ముఖ చిత్రం మారాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పల్లె రూపురేఖలు మారాలన్నారు. గ్రామీణ రహదారి వ్యవస్థ అభివృద్ధిచెందాలన్నారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నత స్థాయి చదువులు పల్లెలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజారోగ్యం బాగుండాలన్నారు. ప్రాథమిక వైద్యకేంద్రాలను అభివృద్ధి చెందామన్నారు. మన గ్రామాలు స్వచ్ఛతకు ప్రతిరూపాలుగా ఉండలన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో Palle Panduga పల్లె పండగ 2.0 సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పల్లెపండుగ-1ని విజయవంతం చేసుకున్నామన్నారు. ఆ నాటి ప్రణాళికలు ఎంత వరకు కార్యాచరణలో పెట్టామనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇదే సందర్భంలో పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా వల్లెపండుగ 2.0 ప్రణాళికలు ఉండాలన్నారు. ఆయన ఇదే సందర్భంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (Rural development) శాఖ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసారు. పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Tirumala: పరకామణి చోరీపై విస్తృత దర్యాప్తు
Palle Panduga 2.0
ఈ విషయాన్ని తాను పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మనం ఇచ్చిన హమీలన్ని అమలులో ఉన్నాయా? లేదా! అనే అంశంపై పునశ్చరణ జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వాతావరణం ఆదర్శనీయంగా ఉండాలన్నారు. అన్ని దిశలా పల్లెలు సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. గ్రామీణులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలి
సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. Palle Panduga త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై వంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైయిన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలో మంచినీటి సమస్య. జలజీవన్ మిషన్ పరిధిలో పరిష్కారం, ఉపాధి హమీ పనిదినాలు, వేతనాల చెల్లింపులు ఇతర అంశాల పైన డిప్యూటీ సిఎం పవన్ మాట్లాడారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఒ.ఎస్.డి. వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పల్లె పండగ 2.0 ఎప్పుడు ప్రారంభం అవుతోంది?
త్వరలో ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
పల్లె పండగ 2.0లో ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
గ్రామీణ రూపురేఖలు మార్పు, రహదారుల అభివృద్ధి, ప్రాథమిక మరియు ఉన్నత విద్య అందుబాటులో ఉంచడం, ప్రజారోగ్య పరిరక్షణ, స్వచ్ఛ గ్రామాల నిర్మాణం, ఉపాధి హామీలు, జలజీవన్ మిషన్ సదుపాయాలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: