Pakala RTC bus theft: పాకాల బస్సుల్లో దొంగల ముఠా అరెస్టు.. రూ. 3.5 లక్షల నగలు స్వాధీనం!

Follow Us: Google News Daily Hunt
Arrest of accused involved in thefts on RTC buses
Arrest of accused involved in thefts on RTC buses
FONT SIZE
GET APP

Pakala RTC bus theft:32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం, తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలో ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల బ్యాగులు, హ్యాండ్ బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ముఠాలపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తును పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. చిన్న గోవిందు పర్యవేక్షణలో ఎస్ఐ తరుణ్, డబ్ల్యూఎస్ఐ నాగ మంజుల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చేపట్టింది. దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలను గుర్తించిన ప్రత్యేక బృందం ఈ నెల 7వ తేదీన సాయంత్రం శంఖంపల్లి ఫ్లైఓవర్ క్రింద ముగ్గురు మహిళా నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసింది. వీరంతా చిత్తూరు జిల్లా పరిధికి చెందినవారని పోలీసులు తెలిపారు.

Read also: Nadendla Manohar: ఇకపై వాట్సాప్ ద్వారానే ధాన్యం అమ్మకాలు

Arrest of accused involved in thefts on RTC buses
Arrest of accused involved in thefts on RTC buses

Pakala RTC bus theft:మహిళా ప్రయాణికులే లక్ష్యం

విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో, వారి వద్ద నుండి కేసుకు సంబంధించిన సుమారు 32 గ్రాముల బరువున్న డైమండ్ గోల్డ్ నెక్లెస్ చైన్ ను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణం విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. మహిళా ప్రయాణికులే లక్ష్యం ప్రాథమిక విచారణలో నిందితులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకొని, రద్దీని ఆసరాగా తీసుకుని వారి బ్యాగుల్లోని విలువైన బంగారు ఆభరణాలను అపహరిస్తూ వచ్చినట్లు వెల్లడైంది. కేసును అత్యంత త్వరితగతిన ఛేదించి, నిందితులను అరెస్టు చేయడంతో పాటు దొంగిలించిన ఆభరణాన్ని రికవరీ చేసిన ఎస్ఐ తరుణ్, డబ్ల్యూఎస్ఐ నాగ మంజుల, ప్రత్యేక పోలీసు బృందాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు