Padayatra: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన ‘సంకల్ప యాత్ర’ మంగళవారం నాటితో దిగ్విజయంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అక్రమ కేసులు తొలగిపోవాలని, ఆయన క్లీన్ చిట్‌తో బయటకు రావాలని కోరుకుంటూ బండ్ల గణేష్ ఈ సుదీర్ఘ పాదయాత్రను మొక్కుగా స్వీకరించారు.
Read also: Gurazala court verdict : పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ నిర్ణయం!
గత నెల జనవరి 19న తన స్వస్థలమైన షాద్‌నగర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, సుమారు 23 రోజుల పాటు నిరంతరాయంగా సాగింది. దాదాపు 500 కిలోమీటర్ల మేర సాగిన ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో గ్రామాలు, పట్టణాలను దాటుకుంటూ ఎట్టకేలకు తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. తన ఇష్టదైవానికి మొక్కుకున్న విధంగానే చంద్రబాబు నాయుడు నిర్దోషిగా తేలడంతో, ఆ కృతజ్ఞతా భావంతో ఈ యాత్రను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: