వ్యవసాయ శాఖ సంచాలకుడు ఢిల్లీ రావు
విజయవాడ: సేంద్రియ(Organic) విధానాల ద్వారా పంటల సాగుకు తిరిగి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా లక్ష్యసాధనకు కార్యా చరణ ప్రణాళిక రూపొందిం చినట్లు వ్యవసాయ శాఖ సంచాలకుడు ఢిల్లీ రావు(DelhiRao) తెలిపారు. పొలంపిలుస్తోంది. కార్యక్రమము ద్వారా ముమ్మర ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. గురువారం నాడు 6 రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో రసాయనిక ఎరువుల వినియోగంను తగ్గించే ప్రత్యామ్నాయ పద్ధతులను, వాటి ప్రయోజనాలను తెలిపే గోడ పత్రికను డిల్లీ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిల్లీ రావు మాట్లాడుతూ రాష్ట్రము(In State)లో సాలీనా 36.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారని వాటి వినియోగంలో 4 లక్షల మెట్రిక్ టన్నులను అనగా 11 శాతం మేర తగ్గించేలా తీవ్ర కృషి చెయ్యాలని తద్వారా వినియోగాన్ని 32.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ ను ఆదేశించారని తెలిపారు.
ఎరువుల వాడకంలో సమతుల్యత
ఆ లక్ష్యాన్ని సాధించేదిశగా కార్యాచరణను తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఒకలక్ష మెట్రిక్ టన్నులను, వివిధ రకాల సేంద్రీయ ఎరువులైన వర్మికంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చి రొట్ట ఎరువులు తదితర వాటిని నేలకు అందించడం ద్వారా మరొక లక్షన్నర టన్నులను తగ్గించే ప్రత్యామ్నాయ అంశమని మరియు జీవన ఎరువులైన నైట్రో బాక్టీరియా,ఫాసో బాక్టీరియా , వేప పిండి, నూతనముగా ప్రవేశపెట్టిన నానో ఎరువులైన నానో యూరియా, నానో డిఏపి తదితరములను వాడి రసాయనిక ఎరువుల వినియోగం లో చాలా సులభముగా 11 శాతం మేర తగ్గించవచ్చని, తద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. రైతులు ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించకుండా విచక్షణ రహితముగా ముఖ్యముగా నత్రజని సంబంధిత ఎరువు అయిన యూరియాను వరి, మొక్కజొన్న పంటలలో ఎక్కువగా వాడకం వల్ల పైర్లలో మెత్త దనం, సున్నితత్వం పెరిగి తెగుళ్లు, పురుగులు ఎక్కువగా ఆశించి పంటలను దెబ్బతీస్తున్నాయని తెలిపారు .
వరి ఏం ఇస్తుంది?
ఆహార భద్రతలో వరి వరి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా బియ్యం ప్రధాన ఆహారంగా ఉన్న ఆసియా దేశాలలో. వరదలు పడిన వరిలో పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా, ఈ పద్ధతి లక్షలాది మందికి నమ్మకమైన ఆహార వనరును నిర్ధారిస్తుంది.
వరి ఉపయోగాలు ఏమిటి?
వరి లేదా బియ్యం ప్రధాన ఆహారంగా దాని ప్రాథమిక పాత్రకు మించి అనేక ఉపయోగాలను కలిగి ఉంది. ఇది శక్తికి మూలం, వివిధ ఆహార తయారీలలో ఉపయోగించబడుతుంది మరియు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అదనంగా, గడ్డి మరియు పొట్టు వంటి దాని ఉప ఉత్పత్తులు పశుగ్రాసం, పైకప్పు కోసం మరియు వినూత్న పర్యావరణ అనుకూల ఉత్పత్తులలో కూడా ఉపయోగించబడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Nominated Post: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభం